Srisailam

Karthika Masam: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక శోభ..పోటెత్తిన జనం

Karthika Masam: ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి క్షేత్రంలో నేటి నుండి కార్తీక మసోత్సవాలు ఘనంగా ప్రారంభమైనయి నేటి నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కాగా డిసెంబర్ 1 వతేది వరకు జరగనున్నాయి కార్తీక మసోత్సవాల ప్రారంభంలో భాగంగా వేకువజామనే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ముందు ఉన్న గంగాధర మండపం వద్ద అలానే క్షేత్రంలో పలు చోట్ల కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు అనంతరం శ్రీస్వామి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్స్ క్యూ కంపార్టుమెంట్ లలో ఓం:నమశ్శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ బారులు తీరారు క్యూ కంపార్టుమెంట్ లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ముందస్తు ఏర్పాట్లు చేశారు. 

ఇది కూడా చదవండి: Nirmal:ఏటీఎం దొంగ దొరికాడోచ్‌!

Karthika Masam: రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు దీనితో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది అలానే క్యూలైన్స్ లో వేచి వుండే భక్తులకు అల్పాహారం,బిస్కెట్లు,పాలు, మంచినీరు అందిస్తున్నారు అలానే దేవస్థానం ఉద్యోగులకు కార్తీకమాసం ప్రత్యేక విధులు కూడా కేటాయించారు అయితే నేడు కార్తీకమాసం మొదటి రోజు అలానే వారాంతం కావడంతో భక్తులు రద్దీ స్వల్పంగా పెరిగింది కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవులు,కార్తీకపౌర్ణమి,శని,ఆది,సోమ,ఏకాదశి రోజులలో శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమె ఉంటుందని మిగిలిన సాధారణ రోజులలో రోజుకు మూడు విడతలుగా సామూహిక అభిషేకాలు,స్పర్శ దర్శనాలు అందుబాటులో ఉంచామని భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్స్ పొందవచ్చని ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *