Telangana: తెలంగాణలో గత కొన్నాళ్లుగా గురుకులాల విద్యార్థులు ఆందోళనబాట పడుతున్నారు. వివిధ సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం సరిగా ఉండటం లేదని, వసతి సదుపాయాలు సక్రమంగా ఉండటం లేదని, చదువుకు ఆటంకాలు ఉంటున్నాయని పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. తాజాగా శనివారం రంగారెడ్డి జిల్లాలోని ఓ బీసీ గురుకుల విద్యార్థులు జాతీయ రహదారిపైనే రాస్తారోకోకు దిగారు.
Telangana: అన్నం సరిగా ఉండటం లేదని, కూరలు నీళ్లతో ఉంటున్నాయని, ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఏకంగా రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.