Nirmal:అత్యాధునిక టెక్నాలజీని అమర్చిన విషయాలు తెలియకో, ఏదైతే అదైందని అనుకున్నాడో ఏమో కానీ ఏటీఎంలో డబ్బు చోరీ చేసేందుకు యత్నించిన దొంగ క్షణాల్లోనే దొరికిపోయాడు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. నిద్రలో ఉన్నా తేరుకొని జాగరూకతగా వ్యవహరించిన బ్యాంకు మేనేజర్, వెంటనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు వారి శాఖల నుంచి అభినందనీయులయ్యారు.
Nirmal:నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్‌లో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం తెల్లవారుజామున చోరీకి యత్నించాడు. ఏటీఎం మిషన్ నుంచి డబ్బును గుంజేందుకు వెతికాడు. ఎలాగైనా డబ్బును చోరీ చేసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ప్రయత్నం ఫలించక అక్కడి నుంచి జారుకున్నాడు.
Nirmal:ఆ దొంగ చోరీకి యత్నిస్తున్న విషయం అలారం సిస్టం ద్వారా వెంటనే కెనరా బ్యాంకు మేనేజర్‌కు వెళ్లింది. అప్రమత్తమైన ఆయన 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ ఇతర పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లి పరిశీలించారు.
Nirmal:పోలీసులు ఏటీఎం వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దుండగుడి దుస్తులు, ఆకారాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమీప ప్రదేశాల్లో వెతకసాగారు. ఈలోగా బస్టాండ్‌లో వెతుకుతుండగా, ఆ గుర్తు తెలియని దొంగ కుంచం గంగాధర్‌గా గుర్తించిన పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో ఏమైనా దొంగతనాలకు పాల్పడ్డాడా అన్న విషయాలను ఆరా తీస్తున్నారు.