Pakistan: పాకిస్థాన్‌లో సాయుధ సున్నీ-షియా ముస్లిం గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో 40 మంది చనిపోయారు. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో సున్నీ ముస్లింలు మెజారిటీ, షియా ముస్లింలు 15 శాతం మైనారిటీ. ఈ రెండు వర్గాల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఖురారం జిల్లాలో సున్నీ, షియా ముస్లింల మధ్య గత జూలైలో భూ వివాదం చెలరేగింది. ఆ వివాదం ఇప్పటికీ చల్లారలేదు. ఈ నేపథ్యంలో కురారం జిల్లాలోని బగన్ ప్రాంతంలో గత రాత్రి సున్నీ, షియా సాయుధ సమూహాల మధ్య హింస చెలరేగింది.
ఇది కూడా చదవండి: Maharashtra: విజయోత్సవ ర్యాలీలో అపశృతి.. ఒక్కసారిగా అగ్నిప్రమాదం
Pakistan: ఇరువర్గాలు దుకాణాలు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. తుపాకులతో సహా ఆయుధాలతో వంతులవారీగా పోరాడారు.దాడి ఫలితంగా రెండు వైపులా మొత్తం 40 మంది మరణించారు; 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 21వ తేదీన ఉగ్రవాదులు వాహనాలపై కాల్పులు జరపడంతో 50 మందికి పైగా పౌరులు చనిపోయారు.ఆ షాకింగ్ ఇన్సిడెంట్ నుంచి దేశం బయటపడక ముందే మరో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.