Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చంద్‌గఢ్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి శివాజీ పాటిల్ గెలుపొందారు. శివాజీ పాటిల్ ఎన్నికల విజయాన్ని జరుపుకునేందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ ఉత్సవంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
విజయోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో, శివాజీ పాటిల్ కు మద్దతుగా ఊరేగింపులో పాల్గొన్న వారిపై బంగారు రంగు పౌడర్ చల్లుకున్నారు. అగ్ని చెలరేగడంతో, శివాజీ పాటిల్ సహా, అనేక మంది మహిళలు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు, అదృష్టవశాస్తు ప్రాణనష్టం జరగలేదు.
శివాజీ పాటిల్, మహారాష్ట్రలోని చంద్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) అభ్యర్థులపై 24,134 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అజిత్ పవార్ వర్గం చెందిన రాజేష్ పాటిల్ ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు
ఈ ఘటన, శివాజీ పాటిల్ విజయోత్సవ వేడుకలు అనూహ్యంగా చేదు అనుభవంలో మారిపోయిన సందర్భాన్ని తలపిస్తోంది.