Rana Daggubati: విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘డార్క్ చాక్లెట్’. దీనిని వాల్టెయిర్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా కలిసి, రానా దగ్గుబాటి సమర్పణలో నిర్మిస్తున్నాయి. గతంలో వీరి కాంబోలో ‘పరేషాన్, 35 చిన్న కథ కాదు’ చిత్రాలు వచ్చాయి. ఇది మూడో సినిమా. దీనికి శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో విశ్వదేవ్ రాచకొండ, ఫ్యాషన్ అటైర్ తో అల్ట్రా మోడరన్ వైబ్ స్టైలిష్ మేకోవర్ తో ఆకట్టుకున్నాడు. అలానే బిందు మాధవితో మరో ఇద్దరు కీలక పాత్రధారులూ ఉన్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇదే యేడాది జనం ముందుకు రాబోతోంది. గతంలో స్పిరిట్ మీడియా, రానా దగ్గుబాటి ‘బొమ్మలాట’, ‘చార్లీ 777’, ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘గార్గి’, ‘కీడాకోలా’ వంటి చిత్రాలను అందించారు. అలానే ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్ స్టాండింగ్’ తో అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందారు. ఇటీవల వచ్చిన ’35 చిన్న కథ కాదు’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విశ్వదేవ్ రాచకొండ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.