Crime Story: క్షణికావేశం కొంపలు ముంచేస్తుంది. ఒక్కోసారి హత్యలకు దారి తీస్తుంది. ఆవేశం చల్లారాకా చూస్తే జీవితం తెల్లారిపోతుంది. ఇదిగో అలాంటి సంఘటనే ఇది. కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చినపుడు వారితో సర్దుకుపోలేని పరిస్థితులు ఏర్పడినపుడు.. గందరగోళం చెలరేగుతుంది. ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అలా ఒక కుటుంబంలో వచ్చిన తుపాను అనుకోకుండా హత్యకు దారి తీసింది. ఆ హత్యను కప్పిపెట్టడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో చక్కని కుటుంబంలోని తల్లీకూతుళ్లు కటకటాల పాలవాల్సి వచ్చింది.
Crime Story: కోల్‌కతా కు చెందిన ఫల్గుణి ఘోష్ విషయంలో అదే జరిగింది. తన మామకు సోదరి అయిన మహిళ తప్పని పరిస్థితుల్లో వారి ఇంట్లో ఉంటోంది. అయితే, ఆమె ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గొడవలు ప్రారంభం అయ్యాయి. దీంతో తరచు ఘర్షణ పడేవారు. అలానే జరిగిన గొడవలో కోపం ఆపుకోలేక ఆమెను ఫల్గుణి గట్టిగా కొట్టింది. ఆ దెబ్బతో ఆమె అక్కడకు అక్కడే మరణించింది. పూర్తి వివరాలు ఇవే..
Crime Story: కోల్‌కతా లో ఫల్గుణి ఘోష్ ఆమె కుమార్తె ఆర్టిఘోష్ నివాసం ఉంటున్నారు. ఫల్గుణి మామకు సోదరి సుమితా ఘోష్ అసోం లో ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. దీంతో సుమితా అసోం నుంచి కోల్‌కతా తన సోదరుడి ఇంటికి వచ్చింది. అక్కడే ఉంటోంది. అయితే, ఆమెతో ఫల్గుణికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. నిత్యం ఎదో ఒక విషయంపై సుమితా, ఫల్గుణి మధ్య వాగ్వాదాలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో సోమవారం కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమేపీ పెద్దది అయి.. ఒకరిని ఒకరు కొట్టుకునే దాకా పరిస్థితి చేరింది. ఈ క్రమంలో ఫల్గుణి ఘోష్ ఆవేశం ఆపుకోలేక సుమితా ను గట్టిగ కొట్టింది. ఆ దెబ్బతో అక్కడికక్కడే ఆమె మరణించింది.
Crime Story: సుమితా మరణంతో షాక్ అయిన ఫల్గుణి ఆ హత్య తనమీదకి రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేసింది. తన కుమార్తె ఆర్థి ఘోష్ తో కలిసి సుమితా శరీరాన్ని ఒక పెద్ద సూట్ కేస్ లో పెట్టి గంగా నదిలో పారేయడానికి ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి మృతురాలికి సూట్ కేస్ లో పెట్టి ఉత్తర కోల్‌కతాలోని కుమార్తులిలోని గంగా నది ఒడ్డుకు ఉదయం 8 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. సూట్ కేసు తీసుకుని నదివైపు వెళుతుండగా.. అక్కడే ఉన్న కొందరికి అనుమానం వచ్చింది. వారిద్దరినీ సూట్ కేస్ లో ఏముందని అడిగారు. అయితే, అందులో తమ పెంపుడు కుక్క ఉందని. అది చనిపోవడంతో గంగ ఒడ్డున పాతి పెట్టడానికి తీసుకువచ్చామని తల్లీకూతుళ్లు చెప్పారు. కానీ, వారి అనుమానాస్పద నడవడిక అక్కడి వారిలో అనుమానాలు రేపింది. సూట్ కేస్ ఓపెన్ చేయమని అడిగారు. దానికి తల్లీకూతుళ్లు ఒప్పుకోలేదు. దీంతో అనుమానం బలపడిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Crime Story: ఇంకేముంది.. క్లైమాక్స్ లో పోలీసులు వచ్చి సూట్ కేస్ తెరిచారు. అందులో మృతదేహం చూసిన స్థానికులు షాక్ అయ్యారు. తల్లీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం ఫల్గుణితో జరిగిన తీవ్ర వాగ్వాదంలో సుమిత మరణించిందని కోల్‌కతాలోని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Crime Story: సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గొడవ జరిగింది. ఫల్గుణి మృతురాలిని గోడకు తోసేసింది. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు, పెద్ద గొడవ జరిగింది. ఫల్గుణి ఆమె ముఖం, మెడపై ఇటుకతో కొట్టడంతో ఆమె మరణించింది. ఆ తర్వాత తల్లి, కూతురు మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో వేసి నదిలోకి విసిరే ప్రయత్నం చేశారు. అక్కడి స్థానికులు అనుమానంతో సమాచారం ఇవ్వగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారని ఆ అధికారి వివరించారు.