Crime News: ఏడడుగులు నడిచిన భర్తను వద్దనుకున్నది.. కడుపున పుట్టిన పిల్లలనూ కాదనుకున్నది.. సోషల్ మీడియాలో పరిచయమైన తన కొడుకు వయసుండే ఓ యువకుడిపై వ్యామోహం పెంచుకున్నది. అతనితోనే జీవితం అనుకున్నది. ఆ యువకుడి వెంటే వెళ్లిపోయింది. ఆ ఇద్దరూ కలసి ఏకంగా కాపురం పెట్టారు. కొన్నాళ్లకే వారి మధ్య వచ్చిన చిన్నపాటి మనస్పర్థ ఆ ఇద్దరి జీవితాలను ముగించేలా చేసింది.
Crime News: ఏపీలోని విశాఖపట్నంనకు చెందిన పద్మ (40) అనే వివాహితకు భర్త, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కుమారుడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండగా, కూతరు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నది. భర్త, పిల్లలతో కలిసి హాయిగా కాలం గడుపుతున్నది. ఇదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పరిచయం ఆ కుటుంబంలో కల్లోలమే రేపింది.
Crime News: శ్రీకాళహస్తికి చెందిన సురేశ్ (25) అనే యువకుడితో పద్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లకే సురేశ్ కోసం పద్మ ఏకంగా శ్రీకాళహస్తి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీకాళహస్తిలో ఉన్నదని తెలిసి అక్కడికి వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆమెకు బుద్ధులు చెప్పి కుటుంబంతోనే కలిసి ఉండేలా చొరవ చూపారు.
Crime News: అయితే కొన్నాళ్లకే మళ్లీ ఆమెకు సురేశ్‌పై ప్రమే తగ్గలేదు. ఇక లాభం లేదనుకొని 9 నెలల క్రితం సురేశ్ చెంతకే చేరింది. ఈసారి ఏకంగా సురేశ్‌ను పద్మ పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి కైలాసగిరి కాలనీలో వేరు కాపురం పెట్టారు. పెళ్లయిన నాటి నుంచి ఆ ఇద్దరూ తరచూ గొడవ పడేవారని స్థానికులు చెప్తున్నారు.
Crime News: ఈ దశలో ఓ రోజు టిఫిన్, భోజనం వృథా చేస్తున్నావంటూ పద్మను సురేశ్ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన పద్మ క్షణికావేశంతో ఇంటిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఆ ఘటనతో భయాందోళనకు గురైన సురేశ్.. ఆమెను కిందికి దించి ఇంటిలోనే ఉండిపోయాడు. ఈలోగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
Crime News: ఇంటిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సురేశ్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశాడు. దీంతో తమ వాళ్లను కాదనుకొని, సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయంతో వ్యామోహం పెంచుకొని ఒక్కటైన ఆ జంటపై పలువురు పలు రకాలుగా నిట్టూరుస్తున్నారు.
క్షణికావేశంతో నిండు జీవితాలను నాశనం చేసుకున్నారని కొందరు అంటుండగా, కర్మ ఎవరినీ వదలదని, ఇప్పుడు కొద్దిరోజుల్లోనే అది ప్రభావం చూపుతుందని మరికొందరు శాపనార్థాలు పెడుతున్నారు.