Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు. అనంతరం ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లనున్నారు. 2రోజులపాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాలుగొనున్నారు. నేడు థానే, భివాండి ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తరపున సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు.ఇవాళ రాత్రికి ముంబైలోనే బస చేయనున్నారు. రేపు కోలివాడ, వర్లి, ముంబైలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.