Hyderabad:ఎదుటివారిని ఎలా మోసం చేయాలి అనే పీహెచ్డీ చేస్తున్నారు కేటుగాళ్లు. రోజుకో విధంగా తమలైన శైలిలో ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. ఒకరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి భూమి ఉంటే కొన్న డబ్బుకు డబ్బులు ఇస్తామని నమ్మవాళ్ళకి మోసం చేస్తే… మరొకడు గాడిదలతో మోసం చేశాడు. ఏకంగా వందల కోట్లనేసుకెళ్లాడు. పూర్తి వివరల్లోకి వెళ్తే..
గాడిద పాల పేరిట ఘరానా మోసం జరిగింది. ఏకంగా వంద కోట్లకు టోకరా ఇచ్చిందో సంస్థ. ఆన్లైన్లో ఒక్కో గాడిదను లక్షన్నరకు అమ్మేసింది. వాటిని జనం ఎగబడి కొన్నారు. లీటర్ గాడిద పాలను రూ. 1,600కు కొంటామని నమ్మ బలికింది. ఇలా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన వారికి గాడిదలను అంటగట్టింది. సీన్ కట్ చేస్తే ఆ సంస్థ గాయబ్ అయ్యింది. ఫ్రాంఛైజీ పేరుతో ఈ సంస్థ చేసిన మోసం ఏకంగా వంద కోట్లని తేలింది. తమిళనాడులోని తిరునాళ్వేలికి చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఆన్ లైన్లో ఈ వ్యవహారాన్ని ప్రమోట్ చేసింది. జిల్లా కలెక్టర్తో గాడిదల ఫాం ప్రారంభించారు.కొవిడ్ నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో అవి చూసి సంప్రదించారు.ఒక్కో పాడి గాడిదను రూ.80వేల నుంచి రూ.1.50లక్షల చొప్పున విక్రయించారు. వాటి సంరక్షణ బాధ్యతను అక్కడి రైతులకు అప్పగించారు. గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ.1600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు.సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్క రైతు వద్ద రూ.5లక్షలు తీసుకున్నారు. 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారు. తర్వాత జెండా లేపారు. ఈ విషయంపై చెన్నై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.