delhi

Delhi: స్కూల్ పరీక్షల వాయిదా కోసం ఆకతాయి పని.. పోలీసుల ఉరుకులు.. పరుగులు..

Delhi: ఇటీవల ఢిల్లీలోని ఆసుపత్రులు, విమానాశ్రయాలు, పాఠశాలలకు తరచూ ఫోన్, ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉన్నారు.

ఈ క్రమంలో నిన్న ఢిల్లీలోని 10 పాఠశాలలకు ఓ రహస్య వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. అనంతరం పోలీసులు స్నిఫర్ డాగ్స్‌తో సంబంధిత పాఠశాలలకు వెళ్లి చూడగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

ఇది కూడా చదవండి: MLA Dead: అర్ధరాత్రి శుభ్రం చేస్తుండగా పేలిన తుపాకీ.. ఎమ్మెల్యే మృతి

దీంతో  బాంబు బెదిరింపు బూటకమని తేలింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. ఈ బెదిరింపు కాల్స్ చేసింది ప్లస్ 2 విద్యార్ధి అని తేలింది. స్కూల్ కు సెలవులు ఇవ్వాలనీ.. పరీక్షలు వాయిదా పడాలనీ ఈ బెదిరింపులు చేసినట్టు ఆ విద్యార్ధి చెప్పడంతో పోలీసులతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా నివ్వెరపోయింది. 

తన స్కూల్ కు ఒక్కదానికే బెదిరింపు చేస్తే అనుమానం వస్తుందని ఏకంగా 23 స్కూళ్లకు బాంబు బెదిరింపులు, ఈ-మెయిల్ ద్వారా ఒక్కొక్కరికి ఆరుసార్లు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Maha Kumbh 2025: మహాకుంభ్ నుంచి రెండులక్షల కోట్ల ఆదాయం.. సీఎం యోగి ప్రకటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *