Rajasthan: రాజస్థాన్‌లోని ఉదయపూర్ మాజీ రాజకుటుంబంలో కొనసాగుతున్న వివాదం సోమవారం హింసాత్మకంగా మారింది. ఉదయపూర్ సిటీ ప్యాలెస్‌పై, ఇతర కుటుంబ సభ్యులు, మద్దతుదారులపై భారీ రాళ్ల దాడి జరిగింది. ఇందులో పలువురు గాయపడ్డారు. మహారాణా ప్రతాప్ వారసుల మధ్య ఇలాంటి వైరం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. అదే సమయంలో, సోమవారం అర్ధరాత్రి సమయంలో, ప్రభుత్వం వివాదాస్పద స్థలాన్ని అటాచ్ చేసి, రిసీవర్‌ను నియమించింది.
ఇది కూడా చదవండి: Airtel: టీచర్స్ కోసం ఎయిర్‌టెల్ స్పెషల్ యాప్!
Rajasthan: ఉదయ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన మహేంద్ర సింగ్ మేవార్ మరణించిన తర్వాత అతని కుమారుడు, నాథ్‌ద్వారా బిజెపి ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవార్ పట్టాభిషేకం అలాగే, దానికి సంబంధించిన ఆచారాల గురించి ఈ మొత్తం వివాదం చోటు చేసుకుంది. రాచరికం ముగిసిన తర్వాత కూడా ఈ ఆచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. విశ్వరాజ్ సింగ్ పట్టాభిషేకం తర్వాత సిటీ ప్యాలెస్ లోపల ధునిని సందర్శించాలనుకున్నారు. కానీ సిటీ ప్యాలెస్‌లో నివసిస్తున్న అతని మేనమామ కుటుంబం ఆయనను అందుకు అనుమతించలేదు. దీంతో వివాదం మొదలైంది.