Chintamaneni prabhaker: గత ప్రభుత్వం తనపై 27 అక్రమ కేసులు పెట్టిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.ఇందులో రెండింటిని కోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, తనతో పాటు ఈ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని తెలిపారు.అక్రమ కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు.
తనను వేధించిన అధికారులు కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో తనను వేధించిన అధికారులకు ఇప్పుడు మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.