China Virus

China Virus: చైనా నుంచి కొత్త వైరస్.. నిజంగా అంత డేంజరా?

China Virus: రెండురోజులుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చైనాలో కొత్త వైరస్ వ్యాపించింది. దీని బారిన పడిన ప్రజలు ఆసుపత్రుల్లో క్యూలు కడుతున్నారు.. వందలమంది చనిపోయారు అంటూ రకరకాల కథనాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వైరస్ వార్తలు వైరల్ కావడంతో అందరిలోనూ భయం స్టార్ట్ అయింది. ఐదేళ్ల కిందటి కోవిడ్ బీభత్సం అంతా కళ్ళముందు మళ్ళీ కదలాడుతోంది అందరికీ. మాస్క్ అనే పదానికే అర్ధం తెలీని జనాలు దాదాపుగా మూడేళ్లు మాస్క్ తోనే బిక్కు బిక్కు మంటూ గడిపిన రోజులు యాదికి వస్తున్నాయి. ఉద్యోగం అంటే ఆఫీసుకు వెళ్లడమనే తెల్సిన మనకు ఇది దగ్గర నుంచి పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది అని పరిచయం చేసింది కోవిడ్. ఒక్కటేమిటి మన మొత్తం లైఫ్ స్టైల్ మీద విపరీతమైన ప్రభావం చూపించింది కరోనా మహమ్మారి. 

ఇదిగో మళ్ళీ ఇప్పుడు కొత్తగా హ్యూమన్ మెటా న్యూమోవైరస్ దీనినే HMPV అని పిలుస్తున్నారు. చైనాలో వేగంగా వ్యాపిస్తోందనే వార్తలు మనల్ని కుదురుగా ఉండనీయడం లేదు. అసలు నిజంగా ఈ వైరస్ అంత భయంకరం అయినదా? ఈ ప్రశ్నకు ప్రస్తుతానికి జవాబు లేదు. ఎందుకంటే, చైనాలో ఏమి జరిగినా అది ప్రపంచానికి తెలిసేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. మిగిలిన దేశాలు జాగ్రత్త పడే అవకాశం కూడా ఉండకుండా పోతుంది. అదే కరోనా విషయంలో జరిగింది. మొదట ఇలానే చిన్న వార్తలు వచ్చాయి.. వైరల్ అయ్యాయి. మెల్లగా ఆ మహమ్మారి ఉప్పెనలా ప్రపంచం పైకి వచ్చి చేరేవరకూ ఎవరికీ అర్ధం కాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: Mana Cinema First Reel: బుడిబుడి అడుగుల సినిమాను మన ముందుంచే ‘ఫస్ట్ రీల్’!

China Virus: సాధారణంగా చలికాలంలో మన దేశంలో వైరస్ విజృంభణ ఉంటుంది. ఏ వైరస్ అయినా చల్లటి వాతావరణంలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఆయాసం ఇలాంటి లక్షణాలతో చలికాలంలో దాదాపుగా అందరూ మూడు నాలుగు రోజులు బాధపడటం ఎప్పుడూ జరిగేదే. ఇంటి వైద్యంతో చాలా మంది దీని నుంచి బయటపడిపోతారు. కొందరు ఏవో మందులు తీసుకుని రిలాక్స్ అవుతారు. చాలా తక్కువ మందిలో మాత్రం ప్రాణాంతక పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పొగ తాగేవారు, పొగ వంటి వాతావరణంలో పనిచేసేవారు, ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, అప్పటికే పలురకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు ఇటువంటి వైరస్ ధాటికి తట్టుకోలేక పోతారు. ఈకాలంలొ వైరస్ వ్యాప్తి ఉంటుంది. కానీ, కరోనా లా అంత వేగంగా ఉండదు. కానీ, ఇప్పుడు చెబుతున్న వైరస్ కూడా అంతకంటే వేగంగా ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని చెబుతున్నారు. నిజంగా చైనాలో అంతటి ప్రాణాంతక పరిస్థితులు ఉంటే.. ఆ వైరస్ మన దాకా వస్తే అప్పుడు ఆలోచిద్దాం అనుకునే కంటే, కొన్ని జాగ్రత్తలు ఇప్పటి నుంచే పాటిస్తే మంచిది అని వైద్యులు చెబుతున్నారు. 

ALSO READ  Vishvambhara: "విశ్వంభర" నుంచి తొలి పాట వచ్చేస్తోంది!

ఇది కూడా చదవండి: China New Virus: చైనాలో కొత్త వైరస్‌ కలకలం

తప్పనిసరిగా మాస్క్ ధరించడం..సామాజిక దూరం పాటించడం..తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప జనం ఎక్కువ గుమిగూడే ప్రాంతాల్లో సంచరించకపోవడం.జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడే వారు మూడు నాలుగు రోజులకు కూడా అది తగ్గకపోతే వైద్య సహాయం తీసుకోవడం. జలుబు చేసిన వ్యక్తులు తమ చేతిరుమాలు, బట్టలు వంటివి ప్రత్యేకంగా ఉంచుకుని వాటిని ప్రతి రోజు శుభ్రం చేసుకోవడం 

జలుబుతో బాధపడుతున్నవారికి దూరంగా ఉండడం 

ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కుటుంబంలో ఎవరికైనా జలుబు ఉంటే పిల్లలను వారి దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా చూడడం 

చేతులను శుభ్రపరుచుకోవడం 

అన్నిటినీ మించి మంచి పౌష్టికాహారం తీసుకోవడం 

వీటితో పాటు ఏ విధమైన అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం 

ఈ సూచనలు పాటిస్తూ.. జాగ్రత్తగా ఉంటే.. మళ్ళీ లాక్ డౌన్ లాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి. ఈ వైరస్ ను ఎదుర్కోవాలంటే సామాజిక చైతన్యం చాలా ముఖ్యం. అందరూ జాగ్రత్తగా ఉంటే ఏ వైరస్ కూడా ఏమీ చేయలేదు. చలికాలం ఉండేది మరో రెండు నెలలు మాత్రమే. ఈ రెండు నెలలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఈ ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇస్తున్నాం. ఇది కేవలం ప్రజలను సంబంధిత సమస్యపై అప్రమత్తం చేయడం కోసం మాత్రమే.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *