Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు రామ్మూర్తినాయుడి ఆరోగ్యం విషమించింది. అనారోగ్యంతో కొన్నాళ్లుగా ఆయన హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. మంత్రిగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా నారా రామ్మూర్తినాయుడు తనయుడే సినీ హీరో నారా రోహిత్. రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున 1994-99 మధ్య చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు.