Kaliyugam 2064

Kaliyugam 2064: ‘కలియుగమ్ 2064’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మణిరత్నం

Kaliyugam 2064: శ్రద్థా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన సైన్స్ ఫిక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ ‘కలియుగమ్ 2064’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ను తెలుగు, తమిళ భాషల్లో కె.ఎస్. రామకృష్ణ నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఇటీవల ప్రముఖ దర్శకులు మణిరత్నం ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జనరేషన్ కు నచ్చేలా, అన్ని వర్గాలు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ను నార్వేలో చేశామని మేకర్స్ తెలిపారు. యాడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రమోద్ సుందర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు కేరళ ప్రభుత్వం నుండి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నాలుగు సార్లు అవార్డ్ ను అందుకున్న డాన్ విన్సెంట్ స్వరాలు సమకూర్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: డ్రగ్స్ పై సంచలన ట్వీట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *