Chandrababu

Chandrababu: నేరస్థులూ ఖబడ్దార్‌.. నా దగ్గర మీ ఆటలూ సాగవు: చంద్రబాబు

Chandrababu: తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఆధ్వర్యంలో కడపలో నిర్వహించిన రెండవ రోజు మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉజ్వలంగా ప్రసంగించారు. పార్టీకి నిజమైన కార్యకర్తలే దిక్సూచి అని ఆయన స్పష్టం చేశారు. వలస పక్షుల్లా వచ్చి పోయే వారితో పార్టీకి పనిలేదని పేర్కొన్నారు.

చంద్రబాబు, “నేరచరిత్ర కలిగిన వారితో సంసరం లేదని, అటువంటి వారి కుట్రలు మన వద్ద పని చేయవు. పార్టీ కార్యకర్తలు కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొందరు సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అసభ్య ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి వారిని మన్నించం, అది వారి చివరి రోజు అవుతుంది.”

వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గుండెపోటుతో మరణించారనే నమ్మకం కలిగించారు. నేను కూడా అలాగే నమ్మా. కానీ సాయంత్రానికి గొడ్డలిపోటు నిజం బయటపడింది. నాపై తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు” అంటూ ఆయన ఆరోపించారు. ఈ మహానాడు సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ప్రారంభంలో చంద్రబాబు, తెలుగుదేశం స్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు.

Also Read: Narendra Modi: ఎన్టీఆర్ కు ప్రధాని మోదీ నివాళి

Chandrababu:: ఎన్టీఆర్‌ గురించి మాట్లాడిన చంద్రబాబు, “తెలుగుజాతి ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్‌. సినిమా, రాజకీయ రంగాల్లో రాజులా రాణించిన గొప్ప నాయకుడు. ఆయన జీవితం పట్టుదల, నిజాయితీకి నిదర్శనం. ఎన్టీఆర్‌ జయంతి అంటే ప్రతి తెలుగు మనిషికీ పండుగ రోజే,” అని తెలిపారు. మహానాడులో పార్టి బలోపేతం, ప్రజల సంక్షేమం కోసం పలు అంశాలపై చర్చలు జరిగాయని చంద్రబాబు వివరించారు. పార్టీని మరింత గట్టిగా నిలబెట్టేందుకు కార్యకర్తల సమష్టి శ్రమ అవసరమని పిలుపునిచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *