Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకి ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్న చంద్రబాబు. అక్కడ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లే అవకాశం వుంది. ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రలు అమిత్‌షా, నిర్మలా సీతారామన్ లను కలిసి అమరావతికి ప్రపంచబ్యాంకు, ADB నిధులపై..ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం వుంది.