Helmet Challan: ఒక్కోసారి నవ్వాలో ఏడవాలో తెలియని విధంగా కొన్ని వ్యవస్థలు పని చేస్తాయి. అలాంటిదే ఒక సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ విషయం తెల్సిన పోలీసు అధికారులకు కూడా అదే పరిస్థితి వచ్చింది. విషయం వింటే మీరు కూడా అలానే అవాక్కవుతారు. ఎందుకంటే, అక్కడ ట్రాఫిక్ పోలీసులు నడిచి వెళుతున్న వ్యక్తికీ హెల్మెట్ లేదని చలాన్ ఇచ్చారు. ఇదేదో పొరపాటున జరిగి ఉంటుంది అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్టే. నడుస్తూ వెళుతున్న వ్యక్తిని పట్టుకుని.. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మరీ హెల్మెట్ లేదంటూ చలాన్ చేతిలో పెట్టారు.
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో కాలినడకన వెళ్తున్న వ్యక్తిపై పోలీసులు రూ.300 చలాన్ జారీ చేశారు. హెల్మెట్ ధరించనందుకు ఈ చలాన్ జారీ చేశారు. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కేక్ కొనేందుకు ఈ బాధితుడు వెళుతున్నాడు. ఇంతలో పోలీసులు అతన్ని ఆపారు. ఎక్కడికి వెళుతున్నావని అడిగారు. ఒకసారి పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పారు. ఎందుకు ఏమిటీ అని అడిగే అవకాశం ఇవ్వకుండా ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు.
ఇది కూడా చదవండి: Cardiac Arrest In School: స్కూల్లో గుండెపోటుతో కుప్పకూలింది.. విషాదం నింపిన 8 ఏళ్ల బాలిక హఠాన్మరణం!
Helmet Challan: అక్కడ ఒక బైక్ ముందు అతన్ని నిలబెట్టి ఒక ఫోటో తీశారు. తరువాత అతని చేతిలో హెల్మెట్ లేనందుకు ఫైన్ 300 రూపాయలు కట్టాలనే చలాన్ పెట్టారు. దీంతో ఆ వ్యక్తి లబోదిబో మన్నాడు. ఇదెక్కడి గోలరా బాబు అని పై అధికారులకు విషయాన్నీ ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన అధికారులు ఈ సంఘటనపై విస్తు పోయారు. ప్రస్తుతం ఈ విషయంపై వి చారణ జరుపుతున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.అదండీ విషయం పోలీసులు తలచుకుంటే.. హెల్మెట్ లేదని నడుస్తున్నవారికీ చలాన్ వేయగలుగుతారు. జాగ్రత్త మరి!