Cardiac Arrest In School: అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. గార్గి రణపరా అనే బాలిక ఉదయం 8 గంటల ప్రాంతంలో పాఠశాలకు చేరుకుంది. మెట్లు ఎక్కుతుండగా ఛాతీలో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి లాబీ బెంచ్‌పై కూర్చుంది. కొన్ని సెకన్లలో అలా కుర్చీలో నుంచి నేలపై పడిపోయింది. పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: మినీ గోకులాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనవరి 9న కూడా కర్ణాటకలో అలాంటి సంఘటనే జరిగింది. కర్ణాటకలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో 8 ఏళ్ల బాలిక తేజస్విని తన హోమ్ వర్క్ టీచర్‌కు చూపించడానికి కూర్చున్న బెంచి నుంచి పైకి లేచి స్పృహతప్పి పడిపోయింది. తనను తాను పడిపోకుండా ఆపుకునేందుకు తేజస్విని పక్కనే ఉన్న గోడను పట్టుకుని ప్రయత్నిస్తూనే నేలపై జారిపోయింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని పేర్కొన్నారు.