CBI Cases: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 2024లో అత్యధికంగా 174 కేసులను క్లోజ్ చేసింది. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసులను క్లోజ్ చేస్తున్నట్టు రిపోర్ట్ చేసింది. గతంలో ఎప్పుడూ ఇన్ని కేసులను ఒకే సంవత్సరంలో క్లోజ్ చేయలేదు. 2023లో 62, 2022లో 32 కేసులు క్లోజ్ అయ్యాయి. సాధారణంగా 30-60 కేసుల వరకూ మాత్రమే ఇలా క్లోజ్ చేయడం జరుగుతుంది. కానీ, ఈ సారి ఆసంఖ్య భారీగా ఉండడం గమనార్హం.
ఎన్‌సిపి నాయకుడు ప్రఫుల్ పటేల్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ (2017), మాజీ పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ జార్ఖండ్‌లో అటవీ భూముల మళ్లింపు కేసును ఎదుర్కొంటున్నారు (2017), ఎన్‌డిటివి వ్యవస్థాపకులు ₹48 కోట్ల నష్టం (2017), 2019లో ఐపిఎల్ బెట్టింగ్ (2022) సమస్య వంటి ప్రముఖ కేసులు క్లోజ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ఫైళ్లను మూసివేయాలని, తద్వారా దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయాలని సీబీఐ ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. దీంతో సాక్షాలు లేవంటూ ఒకేసారి ఇన్ని కేసులను మూసివేస్తున్నట్టు రిపోర్ట్ చేశారు సీబీఐ అధికారులు.
ఇది కూడా చదవండి: Eatala Rajendar: ఎంపీ ఈటల రాజేందర్‌పై నమోదైన కేసులివే..