Crime News: రండి బాబు రండి. మీ కార్లు మా వద్ద పెంట్టండి. నెల నెలా డబ్బులు పట్టుకెళ్లండి. నమ్మకం తో ఆలస్యం చేయకుండా..కార్ అండ్ కీస్ ఇచ్చి వెళ్లిపోండి. అలానే అని కొందరు వచ్చారు . కార్ అండ్ కీస్ ఇచ్చారు. అంతే…ఆ తర్వాత కారు లేదు…కార్ కు నేలనెలా ఇస్తున్నాను అని చెప్పిన రెంట్ కూడా లేదు . మరి ఎలా అని ..వెళ్లి అడుగుతే..ఇంకెక్కడా కార్లు…అమ్మేశాడు…ఆ డబ్బులతో జల్సాలు చేసాడు.
చిత్తూరు జిల్లా పలమనేరులో ట్రావెల్ ఏజెన్సీ పేరుతో ఘరానా కార్ల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్ల దొంగ సుబ్బన్న జోయల్ వద్ద నిర్వహిస్తున్న 11 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీ పేరుతో కొందరి వద్ద కార్లను లీజుకు తీసుకున్న ముద్దాయి.. వ్యసనాలకు బానిపై అప్పులు కావడంతో కొత్తరకం దొంగతనానికి తెర తీశాడు కార్ల దొంగ.
Crime News: లీజుకు ఉంచిన కార్లుకు నెలవారి లీజు రుసుము చెల్లించని సుబ్బన్న…లీజు రుసుము రాకపోవడంతో కార్లను వెనక్కు తీసుకెళ్లారు కార్ల యజమానులు..లీజు సమయంలో యజమానుల వద్ద తీసుకున్న కార్లు సెకండ్‌కి తన వద్దే ఉంచుకున్నాడు నేరస్తుడు. సెకండ్‌కి కార్లను కొట్టేసి అమ్మేసుకున్నాడు కేటుగాడు..
తమ కార్ల చోరీలపై వరుస ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లీజు ఉంచిన కార్ల చోరీకి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తమదైన శైలీలో విచారణ చేపట్టి దొంగను పసిగట్టి అరెస్ట్ చేశారు పలమనేరు పోలీసులు..