Br naidu: టీటీడీ ఛైర్మన్ పదవి రావడం తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నానని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు తెలిపారు. తనకు దక్కిన గౌరవప్రదమైన పదవి పట్ల స్పందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఎన్‌డీఏ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ పదవిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నీతి, నిజాయితీగా పనిచేస్తానని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు. ఐదేళ్లు తిరుమల పవిత్రంగా లేదని చెప్పారు. అందుకే ఏడాదికి ఐదారుసార్లు తిరుమలకు వెళ్లే తాను, ఈ ఐదేళ్లు ఒక్కసారి కూడా స్వామివారిని దర్శించుకోలేదని తెలిపారు. ఐదేళ్లు తిరుమలకు వెళ్లలేదంటే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక తిరుమలలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటి గురించి గతంలోనే చంద్రబాబుతో చర్చించినట్లు పేర్కొన్నారు. ఛైర్మన్‌గా మరోసారి సీఎంతో చర్చించి, ఆయన సలహా మేరకు ముందుకు వెళ్తామని బీఆర్ నాయుడు తెలిపారు.
కాగా, టీటీడీ చైర్మన్, సభ్యులను బుధవారం సాయంత్రం టీటీడీ ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది.
బీఆర్ నాయుడు- టీటీడీ ఛైర్మన్
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు
ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు
పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి) – టీటీడీ సభ్యులు
సాంబశివరావు (జాస్తి శివ) – టీటీడీ సభ్యులు
బూంగునూరు మహేందర్ రెడ్డి – టీటీడీ సభ్యులు
అనుగోలు రంగశ్రీ – టీటీడీ సభ్యులు
బురగపు ఆనందసాయి – టీటీడీ సభ్యులు
సుచిత్ర ఎల్లా – టీటీడీ సభ్యులు
నరేశ్‌కుమార్ – టీటీడీ సభ్యులు
డా.అదిత్ దేశాయ్ – టీటీడీ సభ్యులు
శ్రీసౌరబ్ హెచ్ బోరా – టీటీడీ సభ్యులు
శ్రీసదాశివరావు నన్నపనేని – టీటీడీ సభ్యులు
కృష్ణమూర్తి – టీటీడీ సభ్యులు
కోటేశ్వరరావు – టీటీడీ సభ్యులు
మల్లెల రాజశేఖర్ గౌడ్ – టీటీడీ సభ్యులు
జంగా కృష్ణమూర్తి – టీటీడీ సభ్యులు
దర్శన్. ఆర్.ఎన్ – టీటీడీ సభ్యులు
జస్టిస్ హెచ్‌ఎల్ దత్ – టీటీడీ సభ్యులు
శాంతారామ్ – టీటీడీ సభ్యులు
పి.రామ్మూర్తి – టీటీడీ సభ్యులు
జానకీ దేవి తమ్మిశెట్టి – టీటీడీ సభ్యులు