Mulugu: భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు మృతి

Mulugu: ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏటూరునాగారంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.తెలంగాణ గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. అయితే దీనిని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా,మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్‌ను కోల్పోతున్నది. గత నెల 22న ఛత్తీస్‌గఢ్‌ లోని భెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోయారు. యాంటీ నక్సల్స్‌ ఆరేషన్‌లో భాగంగా కుంటా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 మంది మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్‌ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vikarabad: వికారాబాద్ క‌లెక్ట‌ర్‌పై దాడి.. ల‌గ‌చ‌ర్ల గ్రామంలో ఉద్రిక్త‌త‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *