IPL Auction 2025: ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదువార్త. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ హైదరాబాద్లో బంధం తెగిపోయింది. ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు రిటెన్షన్స్లో భాగంగా సన్రైజర్స్ భువీని వదిలేసింది.
అయితే, కనీసం రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారానైనా భువీని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్రైజర్స్ అభిమానులు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు (ఆర్సీబీ) ఆడబోతున్నాడు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది.
ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్లో భాగంగా భువీ రూ.2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. ఆక్షనీర్ మల్లికా సాగర్ భువీ పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీపడుతూ ఏకంగా రూ.9 కోట్ల వరకు తలపడ్డాయి.
అయితే, ఆ తర్వాత లక్నో భువీ ధరను రూ. 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకొంది. దీంతో లక్నోకు భువీ సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం రూ. 75 లక్షలు పెంచి.. మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువీని బెంగళూరు దక్కించుకుంది.
సన్రైజర్స్తో సుదీర్ఘ అనుబంధం
IPL Auction 2025: ఉత్తరప్రదేశ్కు చెందిన భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. తొలి సీజన్లో పుణె వారియర్స్(ఇప్పుడు లేదు) జట్టుకు ఆడాడు భువీ. ఏడు కంటే తక్కువ ఎకానమీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ను.. 2014లో సన్రైజర్స్ దక్కించుకుంది.
సన్రైజర్స్ ను చాంపియన్గా నిలపడంలో కీలకం
రైజర్స్ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాతి సీజన్ నుంచి భువీ ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు.
ఆరెంజ్ ఆర్మీ హార్ట్ బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!
IPL Auction 2025: దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “కావ్యా మేడమ్ భువీని తీసుకోవాల్సింది. నిన్ను కచ్చితంగా మిస్ అవుతావు భయ్యా!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొంత మందేమో.. “నా బ్రేకప్ కంటే కూడా.. భువీ- సన్రైజర్స్ బ్రేకప్తోనే నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను” అంటూ తమ బాధను పంచుకుంటున్నారు.కాగా గతంలో పలు సందర్భాల్లో భువీ సన్రైజర్స్ కెప్టెన్గానూ వ్యవహరించాడు.
మరోవైపు.. ఆర్సీబీ అభిమానులు భువీ రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు భువీ మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19. కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే, దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు.