Google pay: మీరు కూడా Google Pay ద్వారా మీ బిల్లులు చెల్లిస్తుంటే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైంది. ఇటీవల, గూగుల్ పే వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇది లక్షలాది మందికి సమస్యలను కలిగిస్తుంది.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అది ఆఫీసు అయినా, రైల్వే స్టేషన్ అయినా, మెట్రో స్టేషన్ అయినా, వీధిలోని ఒక చిన్న దుకాణం అయినా ఆన్‌లైన్ చెల్లింపు చేస్తున్నాం. చాలా మంది Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్, నీరు, మొబైల్, గ్యాస్ , ఇతర బిల్లులు చెల్లించడానికి Google Pay ఎక్కువగా వాడుతుంటారు.
Google Pay యొక్క కొత్త అప్‌డేట్ ఏంటి ?
గూగుల్ పే ఇటీవల తన “బిల్లు చెల్లింపులు” ఫీచర్‌లో పెద్ద మార్పు చేసింది. కొన్ని మీడియా నివేదికలు, వినియోగదారుల ఫిర్యాదుల ప్రకారం ఈ ప్లాట్‌ఫామ్ నుండి ఇప్పుడు అనేక బిల్ చెల్లింపు ఎంపికలు తొలగించబడ్డాయి. అంతే కాకుండా వాటి వినియోగంలో కూడా మార్పులు చేయబడ్డాయి.
చాలా మంది వినియోగదారులు Google Pay నుండి ఆటో-పే ఫీచర్ ఆపివేయబడిందని చెబుతున్నారు. దీని కారణంగా వారు ఇప్పుడు ప్రతిసారీ మాన్యువల్‌గా చెల్లించాల్సి వస్తుంది.
Also Read: HKU5-CoV-2: చైనాలో కొత్త వైరస్ కలకలం, కోవిడ్ – 19 లాగే.. ఇదీ ప్రమాదకరమా?
కొన్ని కంపెనీలకు బిల్లు చెల్లింపు ఎంపికలు లేవు:
అనేక టెలికాం, విద్యుత్ కంపెనీల బిల్లులు ఇకపై Google Payలో కనిపించవు. దీని వలన వినియోగదారులు మరొక పద్ధతిని వెతుక్కోవలసి వస్తుంది.
టెక్నికల్ ఇష్యూ:
గూగుల్ పే వాడే వారిలో చాలా మంది బిల్లు చెల్లిస్తున్నప్పుడు టెక్నికల్ ఇష్యూ , పెండింగ్ పేమెంట్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Google Payలో మీ బిల్లు చెల్లింపు జరగకపోతే ఏమి చేయాలి ?
Google Pay ఇప్పుడు సురక్షితమేనా?
బిల్లు చెల్లింపుల గురించి అనేక వినియోగదారుల ఫిర్యాదులు ఉన్నప్పటికీ, Google Pay ఇప్పటికీ సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా ఉంది. కానీ కంపెనీ చేసిన మార్పుల కారణంగా వినియోగదారులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కోవచ్చు.