Actress Harassment:

Actress Harassment: నా కోరిక తీర్చు.. నిన్ను స్టార్ హీరోయిన్ ని చేస్తా..!

Actress Harassment: టాలీవుడ్ సినీ పరిశ్రమలో అవకాశాల ఆశ చూపి మహిళలను వేధించే మరో ‘క్యాస్టింగ్’ దారుణం వెలుగులోకి వచ్చింది. సినిమాలో నటించిన తర్వాతా  ఆమెకి రావలసిన డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడమే కాకుండా.. కార్లో ఎక్కించుకుని లైంగిక లొంగుబాటుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సినిమా ఛాన్స్.. ఆపై రూ.1.28 లక్షల బాకీ.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ యువ నటికి, ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పిస్తానని ప్రసాద్ ఆమెను నమ్మించాడు. అతని మాటలు నమ్మి సదరు నటి 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు జరిగిన షూటింగ్‌ షెడ్యూల్స్‌లో పాల్గొంది.

సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆమెకు ఇవ్వాల్సిన రూ.90 వేల పారితోషికం (రెమ్యునరేషన్), ప్రయాణ ఖర్చుల కింద రావాల్సిన మరో రూ.38 వేలు (మొత్తం రూ.1,28,000) ఇవ్వకుండా ప్రసాద్ నెలల తరబడి తిప్పించుకుంటూ మోసానికి పాల్పడ్డాడు.

కారులో కిడ్నాప్ యత్నం.. అసభ్య ప్రవర్తన.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బకాయిల సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందామని బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ నిర్మాత కార్యాలయం వద్దకు రావాలని నటిని ప్రసాద్ కోరాడు. ఆమె అక్కడికి వెళ్లినతర్వాత  నటికి డబ్బులు ఇవ్వకపోగా తీవ్రంగా బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమెను బలవంతంగా తన కార్లోకి ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లాడు. ఇండస్ట్రీలో ఇంకా పెద్ద పెద్ద ఛాన్సులు ఇప్పిస్తానని, అందుకు బదులుగా తన లైంగిక కోరికలు తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు.

నటి తల్లికి కూడా బెదిరింపులు.. పోలీసుల రంగప్రవేశం.

జరిగిన దారుణాన్ని నటి తన తల్లికి చెప్పడంతో, ఆమె నిందితుడు ప్రసాద్‌కు ఫోన్ చేసి గట్టిగా నిలదీసింది. అయితే, నిందితుడు ఏమాత్రం భయపడకుండా నటి తల్లిని తో కూడా కంఠం పెంచి మాట్లాడాడు సినిమా ఇండస్ట్రీ లో ఇలాగే ఉంటుందని డబ్బులు ఎపుడు వస్తాయో చెప్పలేం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇయడమే కాకుండా ఇదేమి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కాదని ఇక్కడ ఉండాలంటే ఇలాగే ఉండాలని ఆమెకి సమాధానం ఇచ్చాడు. దింతో నటి ఇంకా ఆమె తల్లి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.  నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు.

సినీ అవకాశాల ఆశ చూపి మహిళలను వేధించే ఇలాంటి బ్లాక్‌మెయిలర్లపై కఠినంగా వ్యవహరిస్తామని బంజారాహిల్స్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు ముమ్మర దర్యాప్తులో ఉంది. ప్రసాద్ లాంటి కొందరు వ్యక్తుల వల్లే మొత్తం సినీ ఇండస్ట్రీకే చెడ్డపేరు వస్తోందని పలువురు సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *