Balakrishna: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ‘వీర సింహ రెడ్డి’ సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఇంకో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ డైరెక్టర్‌తో పాటు సినిమాలో హీరోయిన్‌ని కూడా రిపీట్ చేస్తున్నారు. ముందు నయనతారని హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న న్యూస్ ఇది.
నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు ఎవరూ చూడని విధంగా చూపించాలని అనుకుంటున్నారు గోపీచంద్ మలినేని. ఈ సినిమా రెండు టైమ్ లైన్స్‌లో జరిగే కథ అని తెలుస్తోంది. ప్రెజెంట్ టైమ్ ఇంకా హిస్టరీ (వారియర్) క్యారెక్టర్‌లో కనిపించనున్నారు బాలకృష్ణ. ఇందులో ఇప్పటికే నయనతారని హీరోయిన్‌గా తీసుకోగా, ఇప్పుడు కాజల్ కూడా ఇందులో నటిస్తోంది అని తెలుస్తోంది. అంటే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారా? లేక షూటింగ్ లేట్ అవుతుందని నయనతార డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారా? అనేది మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తే గాని తెలియదు.
ఇక థమన్.. అఖండ, అఖండ-2, భగవంత్ కేసరి, వీర సింహ రెడ్డి తర్వాత ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
