Kakani Resort Stories: అబ్బా ఎలాంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఎలా అయిపోయాడు. మల్లెపువ్వు లాంటి వైట్ అండ్ వైట్ బట్టలు, చెదరని క్రాఫ్, చుట్టూ పది, ఇరవై మంది అటెండర్లతో దర్జాగా తిరిగే సోగ్గాడిగా కాకాణికి పేరు. వాటర్ బాటిల్, చేతి రుమాలు, దువ్వెన, టీ, కాఫీలు ఇచ్చేందుకు, లగేజ్ మోసేందుకు ఇలా వేరువేరుగా పదుల సంఖ్యలో కాకాణి చుట్టు పనోళ్లు కనిపిస్తుంటారు. వైసీపీ నెల్లూరు లీడర్లలో కూడా మాజీ మంత్రి కాకాణి డ్రస్సింగ్, అటెండర్లు, మెయింటెనెన్స్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి కాకాణి నేడు పోలీసు కేసులు, అరెస్ట్‌లతో కళ చెదిరిపోయి, డ్రెస్సు నలిగిపోయి, జుట్టు పెరిగిపోయి, పోలీసు జీప్‌లో ఖైదీలాగా దిగుతుంటే.. చూసి షాక్ అవుతున్నారు వైసీపీ టాప్ లీడర్స్.
కాకాణి అరెస్ట్‌తో ఫుల్ ఖుషీగా, హ్యపీగా, జోష్‌గా కనిపిస్తోందట సోమిరెడ్డి వర్గం. పగ, ప్రతీకారం తీరిందనే మూడ్‌లోకి వెళ్లిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారట. కాకాణి కేరళలో బాడీ మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడంటూ వార్తలు రావడం.. కాకాణి అవమానకర రీతిలో అరెస్ట్ అవ్వడం తమ్ముళ్ల జోష్‌ని మరింత రెట్టింపు చేస్తోంది. నెల్లూరు తమ్ముళ్లు ఇంతగా ఆనందించడానికి కారణం లేకపోలేతు. వైసీపీ హయాంలో అధికారం అండచూసుకుని రెచ్చిపోయిన కాకాణి… టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేయించాడనీ, జర్నలిస్టులను కూడా వదల్లేదని, ఐదేళ్లూ లెక్కకు మించి పాపాలు చేశాడనీ.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడని తెలుగుదేశం క్యాడర్ అంటోంది. ఇప్పటి వరకు 55 రోజులుగా అజ్ఞాత వాసం గడిపిన కాకాణి… ఈ రోజు నుంచి జైలు వాసం గడపబోతున్నాడంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టి తనదైన శైలిలో స్పందించారు.
కాకాణిపై అక్రమ కేసు బనాయించారంటూ వైసీపీ నేతలు తెగ బాధపడిపోతున్నారనీ, కాకాణికి సంబంధం లేకుండానే వరదాపురం రుస్తుం మైన్స్ నుంచి 60 వేల టన్నుల క్వార్ట్జ్ చైనాకు తరలిపోయిందా అంటూ ప్రశ్నించారు సోమిరెడ్డి. మంత్రిగా వ్యవహరించిన కాకాణి ప్రమేయం లేకుండా ఆయన సొంత మండలం పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్, డంపింగ్ జరిగాయా అంటూ ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆధారాలతో కేసు నమోదు చేయడం వల్లే కాకాణి ఇవాళ జైలుకెళ్లాడంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. సోమిరెడ్డి సంబరాలకు కూడా కారణం లేకపోలేదు. ఆయనపై వైసీపీ హయాంలో 18 కేసులు నమోదయ్యాయి. సోమిరెడ్డి మత్తు పదార్థాలు తీసుకుంటాడంటూ… క్లబ్బుల్లో కూర్చుంటాడంటూ ఆరోపణలు చేసిన కాకాణి, ఏకంగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్రెస్మీట్ పెట్టి సోమిరెడ్డి అక్రమ ఆస్తులంటూ ప్రచారం చేశారు.
Also Read: Mahanadu 2025: కడప గడపలో పసుపు పండగ
ఇక 55 రోజులుగా అండర్ గ్రౌండ్‌లోనే సంచరిస్తున్న కాకాణి గోవర్దన్ రెడ్డి.. ఈ రెండు నెలల్లో ఏపీకి చుట్టు పక్కల నాలుగైదు రాష్ట్రాలలో మకాం మార్చాడట. అయితే ఎక్కడకు వెళ్లినా… లగ్జరీ సదుపాయాలున్న కాస్ట్ లీ రిసార్టులనే ఎంచుకునేవారట. ఎక్కడా రెండు మూడు రోజులకు మించి ఉండేవారు కాదట. సెల్ ఫోన్ వాడితే పోలీసులు ఈజీగా ట్రేస్ చేస్తారని భయపడిపోయిన కాకాణి.. అందుకో కన్నింగ్ ఉపాయం ఆలోచించారట. సెల్ ఫోన్ వాడినా పోలీసులు ట్రేస్ చేయడానికి వీలు లేకుండా.. ఉగ్రవాదులు ఉపయోగించే యాప్స్‌ని వాడినట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ యాప్స్‌తోనే 2 నెలలుగా తప్పించుకు తిరిగినట్లు అనుమానిస్తున్నారు.
తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడిన కాకాణి… ఒక చోట నుంచి మాట్లాడితే, ఇంకో లొకేషన్ చూపించేలా టెర్రర్ యాప్స్‌ని ఫోన్‌లో సెట్ చేసుకున్నారట. అందుకే నాలుగు ప్రత్యేక బృందాలు రెండు నెలలుగా గాలిస్తున్నా కాకాణి చిక్కలేదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇంటర్నెట్‌లో ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు ఉపయోగించే 2 యాప్స్‌ని కాకాణి ఉపయోగించారట. దీంతో కాకాణి కోసం అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ నెల్లూరు పోలీసులు వినియోగించినట్లు తెలుస్తోంది. బెంగళూరు రిసార్టా? కేరళ రిసార్టా? క్లారిటీ రావాల్సి ఉంది కానీ.. ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు కాకాణి. ఇక కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు.