Gali Game Over Next Jagan : ఓబులాపురం మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత వెలువడిన ఈ తీర్పు, వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి సంకెళ్లు వేసింది. గాలితో పాటు బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్, ఓఎంసీ కంపెనీ.. దోషులుగా తేలగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం నిర్దోషులుగా బయటపడ్డారు.
2009లో సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు, గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడం నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణకు సవాల్‌గా మారింది. “గాలిని పట్టుకోవడం అంత సులభం కాదు. రాజకీయ, అధికార వ్యవస్థలు ఒత్తిడి చేశాయి. ఐటీ అధికారులమని చెప్పి, గోప్యంగా అరెస్టు చేశాం” అంటూ లక్ష్మీనారాయణ తన అనుభవాలను వెల్లడించారు. విచారణలో అధికారులు సెలవులు తీసుకుని, సహకరించకపోవడం, బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. 219 మంది సాక్షుల వాంగ్మూలాలు, రూ.844 కోట్ల దుర్వినియోగంపై ఆధారాలతో సీబీఐ కేసును బలోపేతం చేసింది.
ఇక గాలి-జగన్ సంబంధాలు ఈ కేసులో మరో చర్చనీయాంశం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడైన గాలి జనార్ధన్ రెడ్డి, జగన్‌ను దేవుడిచ్చిన సోదరుడిగా భావించాడు. అందుకే జగన్ ధన దాహానికి దేవుడు ఇచ్చిన అన్న గాలి జనార్థన్ రెడ్డి బలయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. ఓబులాపురం అక్రమ మైనింగ్ వెనుక అసలు సూత్రధారి జగన్ మోహన్ రెడ్డి అనేది బహిరంగ రహస్యం. అయితే టెక్నికల్‌గా చట్టప్రకారం గాలి జనార్థన్ రెడ్డి మాత్రమే ఈ కేసులో నిందితుడు. ఓఎంసీ తవ్వకాల్లో వచ్చిన డబ్బును గాలితో కలిసి జగన్ మింగేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెబితేనే ఓఎంసీకి మైనింగ్ అనుమతులు ఇచ్చినట్లు అప్పట్లోనే సబితా ఇంద్రారెడ్డి, అధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని సీబీఐ రుజువు చేయలేకపోయింది. కాబట్టి చట్టానికి దొరకకుండా జగన్ తప్పించుకున్నాడు. ఓబులాపురం మైనింగ్‌లో జగన్‌కు వాటా ఇచ్చినందుకే.. కడప జిల్లాలో బ్రహ్మణీ స్టీల్స్ సంస్థకు ఏకంగా 5 వేల ఎకరాలను నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించి ఆయాచిత లబ్ది కలిగించిందని చెప్తారు.
Also Read: India-Pakistan: ఆపరేషన్ సిందూర్… ఉగ్రవాదం బద్దలైపోయింది, యుద్ధం అంచున భారత్-పాకిస్తాన్?
Gali Game Over Next Jagan: 2009లో వైఎస్ మరణం తర్వాత, గాలి జనార్ధన్‌రెడ్డి… జగన్‌ను సీఎంగా చేసేందుకు రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు కూడా చేశాడట. ఈ కుట్రలతో పాటూ, ఓఎంసీ అక్రమాలపై ఆనాటి రోశయ్య ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఫలితంగా సీబీఐ విచారణ కూడా మొదలైంది. ఆ నాటి నుండి శర వేగంగా కాకున్నా.. ఒక పద్దతి ప్రకారం సీబీఐ విచారణ ముందు సాగుతూ వచ్చింది. ఇప్పుడు గాలి జైలు ఊచలు లెక్కిస్తుండగా, జగన్ అక్రమాస్తుల కేసులపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో జగన్ కేసుల్లోనూ విచారణ వేగవంతమవుతోంది. గాలికి పడిన శిక్ష.. జగన్‌కు హెచ్చరికగా మారింది. గాలికి పట్టిన గతే.. మున్ముందు జగన్ పరిస్థితి కూడా అనే చర్చ రాజకీయ సర్కిల్స్‌లో జోరందుకుంది.
శిక్షలు లేట్ అవ్వొచ్చు కానీ.. అవినీతి తిమింగళాల విషయంలో మన దేశ చట్టాలు, న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సీఎంలుగా ఉన్న జయలతిత, లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్‌లు జైలు బాట పట్టడం చూశాం. ఆ లిస్టులో జగన్ రెడ్డి చేరిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. 4 వేల 300 కోట్ల అవినీతి కేసులో అన్నకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. మరి 43 వేల కోట్ల అక్రమాస్తుల కేసుల్లో తమ్ముడికి కనీసం 14 ఏళ్లయినా పడకపోతుందా అనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.