Baby John Movie

Baby John Trailer: అదిరిన ‘బేబీ జాన్’ ట్రైలర్!

Baby John Trailer: తమిళ చిత్రం ‘తేరీ’ రీమేక్ గా హిందీలో రూపుదిద్దుకుంది ‘బేబీ జాన్’ మూవీ. ఈ సినిమాతోనే కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక్కడ విజయ్ చేసిన పాత్రను హిందీ రీమేక్ లో వరుణ్ ధావన్ చేస్తున్నాడు. డిసెంబర్ 25న జనం ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అట్లీ సమర్పణలో కలీస్ డైరక్ట్ చేసిన ఈ మూవీ పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఇందులో డీసీపీ సత్యవర్మ గా వరుణ్ ధావన్ కనిపించబోతున్నాడు. ఈ ట్రైలర్ లో వరుణ్ ధావన్ తో పాటు కీర్తి సురేశ్, వామికా గబ్బి, సన్యా మల్హోత్రా తదితరులు కనిపించారు. జాకీ ష్రాఫ్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ – త్వరలో ఫ్లైట్ సేవలు ప్రారంభం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *