Fire Accident: జగిత్యాల పట్టణంలోని సారగమ్మ వీధిలో గల అమ్మాజీ పంజాబీ డ్రెస్ మెటీరియల్ షాప్ లో ప్రమాదవశాత్తు రాత్రి నిప్పు అంటుకోవడంతో దుకాణం షట్టర్ లో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు దుకాణ యజమానికి సమాచారం ఇచ్చి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా ఎట్టకేలకు మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పీవేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న అమ్మాజీ డ్రెస్సెస్ యజమాని మంటలను చూసి ఇది ముమ్మాటికి దీపావళి టపాకాయలు కాల్చడం వల్లనే జరిగిందని దీనికి బాధ్యులు టపాకాయలు పేల్చిన వ్యక్తులే అంటూ దాదాపు 20 నుండి 30 లక్షల డ్రెస్ మెటీరియల్ అగ్నికి ఆహుతి అయినాయని ఈ నష్టాన్ని ఎవరు భరించాలని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.