Arijit Singh World Record: అరిజిత్ సింగ్ సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నారు! తాజాగా బ్రిటిష్ గాయకుడు ఎడ్ షీరన్‌తో కలిసి “సఫైర్” అనే సింగిల్ విడుదల చేసిన అరిజిత్, ఈ పాటతో ఇంటర్నెట్‌ను షేక్ చేశారు. ఈ పాట వైరల్‌గా మారడమే కాక, అరిజిత్ రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. జులై 1న దర్శకుడు మోహిత్ సూరి, సంగీత దర్శకుడు మిథూన్‌తో కలిసి “సైయారా” అనే మరో అద్భుతమైన పాటను విడుదల చేశారు. ఇక తాజాగా స్పాటిఫైలో అత్యధిక ఫాలోవర్ల రికార్డును బద్దలు కొట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అరిజిత్ సింగ్ 151 మిలియన్ ఫాలోవర్లతో ప్రపంచంలోనే టాప్ మ్యూజిక్ ఆర్టిస్ట్‌గా నిలిచారు. ఈ విజయంతో అరిజిత్, 139M ఫాలోవర్స్ కలిగిన అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంతేకాదు, ఎడ్ షీరన్ (121M), బిల్లీ ఐలిష్ (114M), ది వీకెండ్ (107.2M) వంటి విదేశీ సంగీత దిగ్గజాలను కూడా అధిగమించారు. అరిజిత్ సింగ్ ఈ సంచలన విజయాలతో బాలీవుడ్ సంగీతాన్ని ప్రపంచ వేదికపై మరోసారి గర్వించేలా చేశారు.
