Nadaaniyan

Nadaaniyan: నేరుగా ఓటిటికి వచ్చేస్తున్న సైఫ్ అలీఖాన్ కొడుకు తొలి సినిమా!

Nadaaniyan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ కలిసి ‘నాదానియన్‌’ సినిమా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.ఈ మూవీ నేరుగా ఓటీటికి వచ్చేస్తుంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వాస్తవానికి.. ఇది సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తొలి చిత్రం. అంత పెద్ద స్టార్ హీరో కొడుకి సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఇలా నేరుగా ఓటీటికి రావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ దీనికి ముందు 2 సినిమాల్లో పనిచేసింది.

Also Read: Vastu Tips: వాస్తు ప్రకారం స్టడీ టేబుల్‌ను ఏ దిశలో ఉంచాలంటే?

ఇటీవల, ఆమె ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి ‘లవ్యాపా’ చిత్రంలో కనిపించింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. ఖుషీ కపూర్ ప్రస్తుతం ‘నదానియన్’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.

నాదానియన్ | తేదీ ప్రకటన | ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ | నెట్‌ఫ్లిక్స్ ఇండియా: 

NadaaniyanNadaaniyan

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *