AP Chief Secretary: 

AP Chief Secretary: సాయి ప్రసాద్ తో కీలక సమావేశంలో పాల్గొన్న APSFTVTDC చైర్మన్ భరత్ భూషణ్, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్, పలు శాఖల అధికారులు

AP Chief Secretary: ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లోని కీలక సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ భరత భూషణ్ గారు, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారితో కలిసి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందే దిశగా చర్చించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా APSFTVTDC భరత్ భూషణ్ గారు తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగం అభివృద్ధి చెందే విధంగా, ముఖ్యంగా సినిమా షూటింగులు గురించి ప్రభుత్వ అధికారులు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సినిమాలకు సంబంధించిన షూటింగులు, వాటి పర్మిషన్లు త్వరగా అందేలా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వాలని చర్చలు జరిగాయి. షూటింగ్లో విధివిధానాలు గురించి అన్ని డిపార్ట్మెంటల్ వారితో చర్చిస్తూ సమావేశం విజయవంతం జరిగింది. సినీ పరిశ్రమ ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి చెందాలని అందరూ ఆకాంక్షిస్తూ షూటింగులు ఎక్కడ లేట్ అవ్వకుండా పర్మిషన్లు ఇచ్చే విధంగా సింగిల్ విండో విధంగా మాట్లాడుకోవడం జరిగింది. అందరి నుండి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడం శుభసూచకంగా భావిస్తున్నాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో షూటింగులు జరుగుతున్నప్పటికీ ఈ షూటింగ్ పర్మిషన్ మరింత వేగంగా వచ్చేలా ఎటువంటి ఇబ్బంది పడకుండా జరగాలని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఉండాలని నిర్ణయించుకున్నాము. ఈ విధానాన్ని త్వరలో ప్రారంభించి పూర్తి వివరాలను వెల్లడిస్తాము.

ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ సిఎస్ సాయి ప్రసాద్ గారు, ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజీత్ గారు, PCCF చలపతి రావు గారు, CFF ఎన్ ఎన్ రావు గారు, శశి భూషణ్ కుమార్, కాంతిలాల్ దండే, సురేష్ కుమార్, సంపత్ కుమార్, యువరాజ్, కన్నబాబు, ఆమ్రపాలి, ప్రవీణ్ ఆదిత్య, శుభం బన్సాల్, భరణి, పద్మావతి, వెంకటరమణ తదితరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *