AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభ్యర్థుల కల సాకారం చేస్తూ.. భారీ రిక్రూట్‌మెంట్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (APSLPRB) మొత్తం 2,050 ఎస్సై, కానిస్టేబుల్, ఇతర సాంకేతిక పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాల వారీగా ఖాళీల పూర్తి వివరాలు..
1. సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) కేటగిరీ – మొత్తం 378 పోస్టులు..
-
సివిల్ ఎస్సై: 253
-
ఏఆర్ (AR) ఎస్సై: 116
-
ఎస్పీఎఫ్ (SPF) ఎస్సై: 09
-
కమ్యూనికేషన్స్ ఎస్సై: 50
-
పీటీవో (PTO): 10
2. కానిస్టేబుల్ కేటగిరీ – మొత్తం 1,156 పోస్టులు..
-
సివిల్ కానిస్టేబుల్: 542
-
ఏఆర్ (AR) కానిస్టేబుల్: 285
-
ఫైర్ సర్వీసెస్: 158
-
జైలు వార్డెన్ (పురుషులు): 150
-
జైలు వార్డెన్ (మహిళలు): 21
-
కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్: 200
-
పీటీవో విభాగం: 15 మెకానిక్స్, 198 డ్రైవర్ పోస్టులు
3. సైంటిఫిక్ అసిస్టెంట్లు – మొత్తం 43 పోస్టులు..
-
ఫిజిక్స్: 10
-
కెమిస్ట్రీ: 13
-
బయాలజీ: 20
త్వరలోనే రాత పరీక్షల తేదీలు..
ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, అర్హతలు, వయోపరిమితి సడలింపులు, రాత పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఖాళీల ప్రకటన వెలువడటంతో అభ్యర్థులు ప్రిపరేషన్‌ను వేగవంతం చేస్తున్నారు.
