AP News: నిరుపేదలు అంటే అదే పేదకూ చులకనే.. అసహాయులు కనిపిస్తే ఎందరో కాదు పొమ్మంటారు? నిస్సహాయులను ఎక్కువ మంది పురుగుల కంటే హీనంగా చూస్తారు! ఇది మనం నిత్యం కళ్లారా చూస్తున్న వైనమే.. ఇక్కడా అదే చులకన.. కానితనం.. హీనత్వంగా చూసే తత్వం కంటపడింది. మానవీయులకు నిజంగా హృదయం ద్రవించే సజీవ సాక్ష్యం. ఇది ఓ నిస్సహాయునికి ఎదురైన చేదు అనుభవం. అలాంటి వారెందరికో జరిగే అవమానం.
AP News: ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ధోరిణికి అద్దంపట్టే ఈ అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకున్నది. అనారోగ్యం కారణంగా ఓ వ్యక్తి ఒక పాదాన్ని ఇటీవలే తొలగించారు. చికిత్స కోసం తాజాగా ఆసుపత్రికి వచ్చాడతను. అయితే మెట్లు ఎక్కి డాక్టర్ వద్దకు వెళ్లాలన్నా, పరీక్షలు చేయించుకోవాలన్నా, మందులు తీసుకోవాలన్నా ఎలా వెళ్లాలి అనుకుంటూ ఇబ్బంది పడుతున్నాడు.
AP News: ఈ లోగా అటుగా దివ్యాంగులు, నిస్సహాయుల కోసం ఏర్పాటు చేసిన వీల్ చైర్‌తో ఓ సెక్యూరిటీ అటుగా వస్తున్నాడు. అయ్యా నాకు కాలు లేదు. నడవలేకపోతున్న. కుర్చీ ఇవ్వండి.. అని ప్రాధేయపడ్డాడు. చెప్పాను కదా.. పేదోడంటే పేదోడికే చులకన అని.. అతను చిరుద్యోగియే. కానీ.. ఆ అసహాయుడి గోడు పట్టించుకోకుండా ఫోన్‌లో మాట్లాడుకుంటూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు.
AP News: మళ్లీ మళ్లీ ఆ నిస్సహాయుడు వేడుకున్నాడు. ఆ సెక్యూరిటీ ఏమన్నాడో తెలుసా? ఇది నీకు కాదు లేవయ్యా? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి ఫోన్‌లోనే మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేమీలేక చేతులతోనే డేకుకుంటూ చికిత్స కోసం ఆసుపత్రిలో ఆ నిస్సహాయుడు తిరగాల్సి వచ్చింది.
AP News: ఇప్పుడు చెప్పండి.. ఆ వీల్ చైర్ నిజంగా ఆసుపత్రిలో ఇలాంటి నిస్సహాయుల కోసమే కదా.. మరి నిజంగా వారికి ఎందుకు సహాయ పడటం లేదు. ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. అలాంటి నిర్లక్ష్యపు సిబ్బందికి ఇలాంటి నిస్సహాయుల రోదన ఎప్పుడు వినపడాలి. ఇది ఈ ఒక్క ఆసుపత్రిలోనే కాదు.. రాష్ట్రలోని పలు ఆసుపత్రులలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
AP News: ఈ అమానుష ఘటనను ఎవరో ఒకరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇప్పటికైనా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో ఉన్న వీల్ చైర్ ఇలాంటి నిస్సహాయులకు వినిగించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని కోరుకుందాం. సెక్యూరిటీ గార్డు లాంటి వారికి కనువిప్పు కలగాలని ఆకాంక్షిద్దాం.