AP IPS Transfers: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో భారీ బదిలీలు, నూతన పోస్టింగులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సస్పెన్షన్ వేటు ఎత్తివేతకు గురైన సీనియర్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలకు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు, కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం మరియు ఖాళీగా ఉన్న పల్నాడు జిల్లాలకు పూర్తిస్థాయి నూతన ఎస్పీలను ప్రభుత్వం నియమించింది.
కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలకు కీలక బాధ్యతలు..
-
కాంతి రాణా టాటా: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ & రోడ్ సేఫ్టీ ఐజీపీ (IGP)గా నియమితులయ్యారు.
-
విశాల్ గున్ని: ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్ దక్కించుకున్నారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (APPA) డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
సీనియర్ అధికారుల బదిలీ వివరాలు..
-
సీహెచ్ త్రివిక్రమ వర్మ: ఎస్పీఎఫ్ (SPF) డీజీగా ఉన్న ఈయనను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
-
ఆర్. జయలక్ష్మి: ఏసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా నియమించారు.
-
బి. రాజకుమారి: ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న రాజకుమారిని రైల్వే ఐజీగా నియమిస్తూ, సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు.
-
బాబూజీ అట్టాడ: గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న బాబూజీని టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేస్తూ, గ్రేహౌండ్స్ డీఐజీగా అదనపు బాధ్యతల్లో కొనసాగించారు.
3 జిల్లాలకు కొత్త ఎస్పీలు – 2020 బ్యాచ్‌కు అవకాశం..
-
మార్కాపురం జిల్లా ఎస్పీ: పంకజ్ కుమార్ మీనా (గతంలో పోలవరం ఓఎస్డీ).
-
పోలవరం జిల్లా ఎస్పీ: కె. చక్రవర్తి (గతంలో సీఐడీ ఎస్పీ).
-
పల్నాడు జిల్లా ఎస్పీ: జగదీశ్ అదహళ్లి (గతంలో సీఎంఎస్‌జీ ఎస్పీ).
ఇప్పటివరకు మార్కాపురం, పోలవరం జిల్లాలకు పక్క జిల్లాల ఎస్పీలే ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తుండగా, పల్నాడు ఎస్పీ బి. కృష్ణారావు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో ఖాళీ ఏర్పడింది. తాజా నియామకాలతో ఈ జిల్లాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు పూర్తిస్థాయి పాలనా యంత్రాంగం సిద్ధమైంది.
