GHAATI Postponed: అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన “ఘాటి” సినిమా చాలా కాలంగా ఎదురుచూపులు పెడుతోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత శ్రద్ధగా తెరకెక్కిస్తున్నారు. అసలు ఈ సినిమా అప్పటికే విడుదల కావాలి. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా సినిమా జూలై 11న theatres లోకి వస్తుందని చెప్పినప్పటికీ, ఆ తేదీకి కూడా రాలేదంటూ చిత్రబృందం అధికారిక ప్రకటన ఇచ్చింది.
వారు చెప్పిన మాటలు వినగానే అందరికీ ఆశ్చర్యమే కలిగింది.
“సినిమా అనేది నది లాంటిది. కొన్ని రోజులు ఆ నది వేగంగా పరుగులు తీస్తుంది.. ఇంకొన్ని రోజులు లోతు పెంచుకోవడానికి ఓ మోస్తరు నడుస్తుంది. మా ఘాటి సినిమా కూడా అలాంటి ప్రయాణంలో ఉంది” అని చెప్పారు.
“ఘాటి” కేవలం ఓ సినిమా మాత్రమే కాదు.. అది ప్రకృతిలో భాగమే అంటున్నారు నిర్మాతలు.
ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా కనిపించేందుకు కాస్త సమయం తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
మీరు చూపిస్తున్న సహనం, ప్రేమకు కృతజ్ఞతలు చెబుతూ.. మంచి అవుట్‌పుట్ వచ్చిన తర్వాతే సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబా గుడి నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ సంగీతం అందించగా, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు.ఇంకా ఎంత ఆలస్యం అయినా.. ఘాటి నుంచి అదిరిపోయే విజువల్స్ రానున్నాయనే హింట్ మాత్రం పక్కా!