Drinker Sai: ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించిన సినిమా ‘డ్రింకర్ సాయి’. బసవరాజు శ్రీనివాస్, లహరిధర్, ఇస్మాయిల్ షేక్ నిర్మించిన ఈ సినిమాతో కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భారీ స్థాయిలో ప్రచారం జరుపుకున్న ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతోంది. ఇటీవల చిత్ర బృందం ప్రీ – రిలీజ్ ఈవెంట్ నూ జరుపుకుంది. ఈ సినిమాలోని పాటలన్నింటినీ ఆస్కార్ విజేత చంద్రబోస్ రాయగా, వాటికి శ్రీవసంత్ స్వరాలు అందించారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నానని కిరణ్ తెలిపారు. ఈ సినిమాలో విషాద గీతం ‘అర్థం కాలేదు అప్పుడు’ను శ్వేత మోహన్ పాడారు. దీనిని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సినిమా ప్రధమార్థం అంతా సరదాగా సాగిపోతుందని, క్లయిమాక్స్ నలభై నిమిషాలు ప్రేక్షకుల మనసుల్ని తాకుతుందని దర్శకుడు చెబుతున్నాడు.
స్పాట్: అర్థం కాలేదు అప్పుడు సాంగ్ ప్లే చేయాలి.