Madhya Pradesh: ఎవరైనా కష్టపడి పనిచేసి జీతం పెంచమని యజమానిని అడగడం సహజం. యజమాని జీతం పెంచవచ్చు. పెంచకపోవచ్చు. పెంచకపోతే చేయగలిగే పరిస్థితి ఉంటె ఆ సంస్థలో కొనసాగుతారు. లేకపోతే మరో ఉద్యోగం వెతుక్కుంటారు. సాధారణంగా జరిగేది అదే కదా. కానీ, మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన యజమానిపై పగ తీర్చుకునేందుకు రూ.18 లక్షలు నష్టం కలిగించాడు. మాల్ లోని విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను పగుల గొట్టాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది.
జీతం పెంచలేదనే కోపంతో, నిందితుడు కమల్ పవార్ షాపింగ్ మాల్‌లోని ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్న టీవీలు, ఫ్రిజ్‌లను పగలగొట్టి ధ్వంసం చేశాడు. 11 టీవీ స్క్రీన్లను పగలగొట్టిన కమల్.. అప్పటికీ కోపం తగ్గకపోవడంతో, ఆ తరువాత 71 ఫ్రిజ్‌లను పగలగొట్టి పాడు చేశాడు. దుకాణం దుస్థితిని చూసి ఆందోళన చెందిన మాల్ ఉద్యోగులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా పెద్ద షాక్‌కు గురయ్యారు. మొత్తం నష్టం చేసింది మాల్ ఉద్యోగులే తప్ప బయటి వ్యక్తులు కాదని తెలిసి అందరూ అవాక్కయ్యారు.
ఇది కూడా చదవండి: Y. S. Sharmila: అన్నా బైబిల్‌పై ప్రమాణం చేస్తారా?.. వైఎస్ జగన్‌కు సోదరి షర్మిల ప్రశ్నల వర్షం
Madhya Pradesh: మాల్‌లో పనిచేస్తున్న ఈ ఉద్యోగి దీపావళి సందర్భంగా మాల్ డైరెక్టర్ ను జీతం పెంచాలని డిమాండ్ చేశాడు. కానీ వారి అతని డిమాండ్ నెరవేరలేదు. అతని జీతం పెంచలేదు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ ఉద్యోగి ఆ తర్వాత మూడు రోజుల సెలవు తీసుకున్నాడు. తిరిగి పనిలోకి వచ్చిన తర్వాత కూడా అతను కోపంగా ఉన్నాడు. అదే కోపంతో మాల్‌లోని దుకాణాన్ని ధ్వంసం చేశాడు.ఈ ఘటన తర్వాత మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్‌లోని వస్తువులను పాడు చేసిన ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ మానసిక స్థితి దృష్ట్యా నిందితుడికి బెయిల్ మంజూరైంది.