Anantapur

Anantapur: అనంతపురంలో ప్రధానోపాధ్యాయుడిని బలిగొన్న స్నేహం.

Anantapur: ఇద్దరిని నమ్మి వారితో కలిసి షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టగా, లాభం తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా కూడేరు మండలంలో చోటు చేసుకుంది. అనంతపురం బళ్లారి రోడ్డులో ప్రశాంతి కుటీర్‌లో భాస్కర్‌ బాబు, ఆయన భార్య సునీత నివాసముంటున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, ప్రస్తుతం భాస్కర్‌ బాబు మల్లికేతిలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేస్తున్నారు.

Anantapur: నగరంలో ఉంటున్న కంబదూరుకు చెందిన మిత్రుడు గాజుల శ్రీనివాసులు, అతని స్నేహితుడు బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేశ్​కుమార్​ రెడ్డి అనంతపురంలో షేర్‌ మార్కెట్, ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో షేర్‌ మార్కెట్​లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ హెచ్‌ఎంను నమ్మించారు. వారి మాటలు నమ్మిన హెచ్ఎం, లోన్​ యాప్‌లు, బ్యాంకులు, బయట వ్యక్తల నుంచి రుణం తీసుకుని సుమారు రూ.60 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దీనికి వారు ప్రామిసరీ నోట్లు, చెక్కు పుస్తకం కూడా ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Legally Veer: రియల్ కోర్ట్ డ్రామాగా లీగల్లీ వీర్

Anantapur: కొన్నాళ్ల పాటు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇస్తూ వచ్చారు. ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అతని పెట్టుబడికి సంబంధించిన ఎలాంటి లాభం, అసలు ఇవ్వకుండా మొండికేశారు. ఈ నేపథ్యంలో అప్పుల భారం పెరిగి బ్యాంకులు, యాప్‌లలో తీసుకున్న రుణాలకు ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారింది. దీంతోపాటు బయటి వ్యక్తులు కూడా అప్పు చెల్లించాలంటూ అడగటంతో ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పుల బాధ భరించలేక కూడేరు మండలం కమ్మూరు సమీపంలో సూసైడ్‌ నోట్ రాసి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Anantapur: ఈ క్రమంలో హెచ్‌ఎం భాస్కర్‌బాబును స్థానికులు గుర్తించి చికిత్స కోసం అత్యవసర వాహనంలో అనంతపురం తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతి చెందారు. నరేశ్‌ కుమార్‌ రెడ్డి, గాజుల శ్రీనివాసుల నుంచి రూ.60 లక్షలు ఇప్పించి తనకు న్యాయం చేయాలంటూ సూసైడ్​ నోట్​ ద్వారా మృతుడు పోలీసులను కోరారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. హెచ్​ఎంకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ap News: క‌డ‌ప జిల్లాలో దారుణం.. మ‌హిళ‌పై హ‌త్యాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *