Injection

Injection: వింటేనే మతిపోతుంది.. ఒక చిన్నారి ప్రాణం కాపాడటానికి 16 కోట్ల రూపాయల ఖరీదైన ఇంజక్షన్!

Injection: ఏంటి డౌట్ పడుతున్నారా? మీరు థంబ్ లో చూసిన టైటిల్ కరెక్టే. ఒక్క ఇంజక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు. అత్యంత ఖరీదైన ఈ ఇంజక్షన్ ఇప్పుడు గుజరాత్ లోని 20 నెలల చిన్నారికి ఇచ్చి ప్రాణాలు నిలబెట్టారు. క్లౌడ్ ఫండింగ్ ద్వారా ఈ మొత్తాన్ని సేకరించారు. ప్రభుత్వం కూడా దీని కోసం అన్నిరకాల టాక్స్ లనూ మినహాయించి సహకరించింది. గతంలో అంటే నాలుగేళ్ల క్రితం కూడా ఇలాంటి సందర్భమే వచ్చింది. అప్పట్లో ఒక చిన్నారికి ఈ ఇంజక్షన్ అవసరం అయింది. అప్పుడు కూడా గుజరాతీలు మానవత్వంతో డబ్బును పోగేసి ఆ చిన్నారి ప్రాణం కాపాడారు.

ఇప్పుడు గుజరాతీలు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. హిమ్మత్‌నగర్‌లో కూడా అలాంటి ఇబ్బందే ఎదుర్కుంటున్న ఒక పేద కుటుంబానికి చెందిన 20 నెలల చిన్నారికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం అయింది. ఆ కుటుంబం తమ పరిస్థితి వివరిస్తూ ప్రజలకు తమ చిన్నారిని కాపాడమని అభ్యర్ధన చేశారు. దీంతో ప్రజలు డబ్బు వసూలు చేయడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలో ఈ మొత్తాన్ని సేకరించారు.

ఈ ఇంజెక్షన్ గత సోమవారం అమెరికా నుండి అహ్మదాబాద్ చేరుకుంది. దాని మోతాదులను మంగళవారం సాయంత్రం బిడ్డకు ఇచ్చారు. ఇప్పుడు చిన్నారి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించిందని వైద్యులు చెబుతున్నారు. గుజరాత్‌లో SMA టైప్-1తో బాధపడుతున్న చిన్నారికి ఇంజక్షన్ ఇచ్చిన మొదటి కేసు ఇది.

ఇది కూడా చదవండి: Delhi New CM: ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అప్పుడే.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సస్పెన్స్!

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్ 1 అనేది జన్యుపరమైన వ్యాధి అని డాక్టర్ సంజీవ్ మెహతా అంటున్నారు. దీనివల్ల కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఆ చిన్నారి పదే పదే న్యుమోనియాతో బాధపడటం జరుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అంతేకాదు, ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ఆధారం లేకుండా కూర్చోలేరు లేదా నిలబడలేరు. కండరాలు బలహీనపడటం వల్ల అవి అన్ని వేళలా నీరసంగా ఉంటారు. . దీని ఇంజెక్షన్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంజెక్షన్ మోతాదు కారణంగా కణాలు చురుకుగా మారతాయి. తద్వారా బలహీనత తొలగిపోవడం ప్రారంభమవుతుంది. ఈ ఇంజెక్షన్ రెండు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే ఇస్తారు.
ఇంజెక్షన్‌ను -70 డిగ్రీల సెల్సియస్ వద్ద అహ్మదాబాద్‌కు తీసుకువచ్చారు.

అడాక్యుమెంట్ వర్క్ పూర్తయిన తర్వాత, అమెరికా నుండి గుజరాత్‌కు ఒక చైన్ సిద్ధం చేసినట్లు డాక్టర్ సంజీవ్ మెహతా తెలిపారు. ఎందుకంటే, ఇంజెక్షన్ ఎప్పుడూ -70 డిగ్రీల వద్ద ఉంచవలసి వచ్చింది. ఈ ఏర్పాటు ఎమిరేట్స్ విమానంలో జరిగింది. దీని తరువాత, ఇంజెక్షన్ దుబాయ్ ద్వారా ఢిల్లీకి చేరుకుంది. తరువాత దానిని మరొక విమానం ద్వారా అహ్మదాబాద్‌కు తీసుకువచ్చారు.

ఆసుపత్రిలో కొన్ని గంటలు -70 ఉష్ణోగ్రత వద్ద ఉంచిన తర్వాత, ఇంజెక్షన్‌ను సాధారణీకరించడానికి 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వద్ద ఒకటిన్నర గంటలు ఉంచారు, ఆపై గంటన్నర ప్రక్రియలో, పిల్లవాడికి వివిధ మోతాదుల ఇంజెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నట్టు డాక్టర్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *