Ambati Murali Krishna

Ambati Murali Krishna: బూమరాంగ్ అంబటి స్ట్రాటజీ..చేసేవన్నీ సెల్ఫ్ గోల్స్.. నవ్వుకుంటున్న పొన్నూరు జనం!

Ambati Murali Krishna: పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఏ అంశాన్ని లేవనెత్తినా చివరికి అది ఆయనకే బూమరాంగ్ అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మొక్కజొన్న దీక్ష: రైతుల కోసం దీక్ష అంటూ హడావిడి చేసిన అంశంలో, ఆయనకు సంబంధించిన గోదాములో తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొక్కజొన్నల వ్యవహారాన్ని టీడీపీ శ్రేణులు బట్టబయలు చేశారు

మామిళ్లపల్లి వ్యవహారం: రాజకీయ అంశాన్ని మహిళలు, సామాజికవర్గాల వైపు మళ్లించడంతో చివరకు వైసీపీకే ఇబ్బందిగా మారిందంటున్న వైసిపి శ్రేణులు

పెదకాకాని ఆలయ అంశం: పోలీసులు దొంగలను పట్టుకుని ఆభరణం రికవరీ చేసిన తర్వాత కూడా రాజకీయంగా వివాదం చేయడం, స్థానిక మద్దతు లేక బయటి వ్యక్తులను సమీకరించారన్న ఆరోపణలు, ముద్దాయి తరపున హైకోర్టులో స్టే కోసం ప్రయత్నాలతో దేవాలయాల మీద కుట్ర రాజకీయాలంటూ ప్రజలు చీదరించుకునే పరిస్థితికి అంబటి మురళి చర్యలు

కొమ్మమూరు బ్రిడ్జి: కాంట్రాక్టర్ దగ్గర ధూళిపాళ్ల ₹5 కోట్లు డిమాండ్ చేయటంతో బ్రిడ్జి పనులు ఆగిపోయాయని ఆరోపణలు గుప్పిస్తే మరోవైపు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చొరవతో అదనపు నిధులు, సాంకేతిక పరిష్కారాలతో పనులు ప్రారంభమయ్యాయని లైవ్ వీడియోలతో కూటమి శ్రేణులు ప్రదర్శన చేసి మరో సారి అంబటి మురళి అబద్దాల మురళి అని ప్రజల్లో దోషిగా నిలబెట్టారు

సంతకాల సేకరణ: బ్రిడ్జి పనులు జరుగుతున్న సమయంలోనే సంతకాల సేకరణకు తెరతీయడం, సొంత నియోజకవర్గంలో కాకుండా బాపట్ల, వేమూరు ప్రాంతాల్లో సంతకాలు సేకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేడర్ మద్దతు లేని రాజకీయమా? స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తల మద్దతు లేక బయట ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చి కార్యక్రమాలు చేసేవారని ఇపుడు ఏకంగా ప్రక్క జిల్లా, ప్రక్క నియోజవర్గాల్లో కార్యక్రమాలు సంతకాల సేకరణ చేపట్టి పొన్నూరు ప్రజలు నవ్వుకునేలా చేస్తున్నాడు అంబటి

ప్రత్తిపాడు బ్యానర్ ఘటన: పొన్నూరు వైసిపి కార్యక్రమంలో తాను ఏకంగా ప్రత్తిపాడు నియోజకవర్గం పేరుతో బ్యానర్ పట్టుకుని ర్యాలీ చేయటంతో సోషల్ మీడియాలో నవ్వులపాలైన అంబటి

40 ఏళ్లుగా ధూళిపాళ్ల కుటుంబంపై కాంగ్రెస్, వైసీపీ తీవ్ర రాజకీయ ఆరోపణలు చేస్తున్నా ఎపుడూ అవినీతి ఆరోపణలు చేయలేదు కొత్తగా అంబటి మురళి అవినీతి ఆరోపణలు చేసి వాటి మీద నిలబడకపోవడం కూడా హాస్యాస్పదంగా ఉంది. ప్రతి అంశం చివరకు అంబటికే బూమరాంగ్ అవుతోందని ప్రజలు శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు

ప్రజా సమస్యల పరిష్కారం కంటే మీడియా, సోషల్ మీడియా హైప్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న అంబటి మురళీకృష్ణ.. ఇకనైనా ‘బూమరాంగ్’ రాజకీయాలకు బ్రేక్ వేస్తారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *