Allu Arjun: పుష్ప2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన కేసు విషయమై ఎంక్వైరీ కోసం అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈరోజు 11 గంటలకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ హాజరుఅయ్యారు. తనతో అల్లు అరవింద్ ఇంకా మామయ్య చంద్రశేఖర్ కూడా ఉన్నారు. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరుఅయ్యారు తొక్కిసలాట ఘటనలో ఏ-11గా ఉన్న అల్లు అర్జున్ ని విచారిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ రాజు. వాంగ్మూలం రికార్డు చేస్తున్న పోలీసులు.
ఇది కూడా చదవండి: Allu Arjun Live Updates: ఎంక్వైరీ టైమ్.. అల్లు అర్జున్ @ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్
అల్లు అర్జున్ కోసం 20 ప్రశ్నలు సిద్ధం చేసిన పోలీసులు
సంధ్య థియేటర్‌కు వచ్చేప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు?
పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు?
పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా? లేదా?
తొక్కసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?
మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు?
రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు?
మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?
ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు?