Cabinet meeting: ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఈ సమావేవం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
Cabinet meeting: రాష్ట్ర మంత్రివర్గ భేటీలో రైతు భరోసా అమలు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపికపై విధివిధానాలు, భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సహా పలు అంవాలను చర్చించే అవకాశం ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా హామీల అమలుపై దృష్టి సారించే విషయంపైనా చర్చించనున్నట్టు తెలిసింది.