Ajith Kumar: భారీ బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థలు స్టార్ హీరోల ఫ్యాన్స్ అలకలు కూడా తీర్చవలసి ఉంటుంది. లేదంటే సోషల్ మీడియాలో నానా యాగీ మొదలవుతుంది. నిజానికి ఆ అలకలు, ఆరోపణలు ఏ స్థాయిలో ఉంటాయంటే తమ హీరోతో కలసి నటించే హీరోయిన్స్, పని చేసే సాంకేతిక నిపుణులు ఎవరుండాలో కూడా డిసైడ్ చేసేంత. ఇక అప్ డేట్స్ విషయం షరా మామూలే. ఎప్పటికప్పుడు తమ హీరో సినిమా అప్ డేట్స్ కోరుకుంటుంటారు. లేదంటే సదురు నిర్మాణ సంస్థలు ట్రోలింగ్ కి గురికాక తప్పదు. తెలుగులోనూ యువీ క్రియేషన్స్, మైత్రీ మూవీస్ వంటి సంస్థలకు ఇది అనుభవైన విషయమే. తమిళంలో ఇప్పుడు లైకా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అజిత్ తో ఆ సంస్థ మగై తిరుమేని ‘విడాముయర్చి’ సినిమా తీస్తోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Ajith Kumar: నిజానికి ఈ మూవీ దీపావళికి వస్తుందని ఎదురు చూశారు. అయితే ఎలాంటి ఇన్ ఫర్ మేషన్ లేదు. ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటున్నారు. దీనిపైనా సమాచారం లేదు. మరో వైపు అజిత్ మరో చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాతలు మైత్రీ మూవీస్ ప్రకటించారు. ‘విడా ముయర్చి’ దీపావళికి రాకపోవడంతో వారి సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయటం లేదు. ఈ అనిశ్చిత స్థితిపైనే అజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో లైకాను ఓ ఆట ఆడుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ ఆందోళనతో అయినా లైకా అప్ డేట్ ని ప్రకటిస్తుందేమో చూడాలి.