TG High Court

TG High Court: సికింద్రాబాద్ భూవివాదంలో తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు!

TG High Court: సికింద్రాబాద్ లోతుకుంట భూవివాదం కేసులో హైడ్రా (HYDRAA) అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే అధికారులకు సంకెళ్లు వేయాలని ఆర్మీ వర్గాలను ఆదేశిస్తూ అత్యంత సంచలన వ్యాఖ్యలు చేసింది.

1. ఆర్మీ భూముల జోలికి వస్తే సంకెళ్లు వేయండి!

కోర్టు అనుమతి లేకుండా ఆర్మీ భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు వచ్చినా సరే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని, అవసరమైతే సంకెళ్లు వేయాలని ఆర్మీకి హైకోర్టు స్పష్టం చేసింది.కోర్టు స్టే ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇలాగే వ్యవహరిస్తే హైడ్రా అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగించి, అవసరమైతే కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించింది.

2. 10 మంది జవాన్లతో కాపలా.. వాహనాలు సీజ్!

వివాదాస్పద భూమి వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు, కోర్టు ఆదేశాల అమలుకు 10 మంది ఆర్మీ జవాన్లను కాపలాగా ఉంచాలని ఆదేశించింది.కోర్టు ఉత్తర్వులను కాదని హైడ్రా అధికారులు అక్కడికి వస్తే వారిని అరెస్ట్ చేయడంతో పాటు, వారు వచ్చే హైడ్రా వాహనాలను కూడా వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది.

3. కోర్టు ధిక్కరణ హెచ్చరికలు

రెండు రోజుల క్రితమే తీవ్ర స్థాయిలో మందలించినప్పటికీ అధికారుల వైఖరి మారకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ పేరుతో ప్రైవేట్ మరియు వివాదాస్పద భూముల్లోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించడంపై క్లాస్ తీస్కుంటూ.. మళ్లీ హైడ్రా అధికారులు ఆర్మీ భూముల జోలికి వస్తే వెంటనే ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *