Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణలో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరుకాన్నారు. గతంలో అల్లు అర్జున్‌కు డిసెంబర్ 13న నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇదే కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రిమాండ్ పూర్తయిన తర్వాత ప్రక్రియలో భాగంగా ఈ రోజు అల్లు అర్జున్ కోర్టులో హాజరుకానున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ అనంతరం వివిధ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బెయిల్ ఉత్తర్వులు ఆలస్యంగా రావడంతో ఒకరోజంతా ఆయన చంచల్‌గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత తెల్లవారుజామున జైలు నుంచి విడుదలయ్యారు. తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై చర్చను లేవదీశారు. దీనికి ప్రతిగా అదేరోజు అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ వైఖరిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అనంతరం ఆయన ఇంటిపై దాడి చేసేంత దాకా పరిణామాలు దారితీశాయి. ఓ దశలో తెలంగాణ, ఆంధ్రా సినిమా అంటూ విభేదాల దాకా దారితీసింది. ఈ లోగా ప్రభుత్వం పలువురు సినీరంగం పెద్దలతో గురువారం సుధీర్ఘ చర్చలు జరిపింది. ఈ చర్చల సారాంశంంలో రెండు విషయాలు తేటతెల్లమయ్యాయి. ప్రభుత్వం నుంచి అటు సినీ రంగం నుంచి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అదే విధంగా సినీ పరిశ్రమ నుంచి సెస్ వసూలుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Allu Arjun: ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, ప్రభుత్వం మధ్య విభేదాలు సమసిపోయినట్టేనా? అన్న అనుమానాలు ఇంకా ప్రజల్లో ఉన్నాయి. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు అని కొందరు అంటుండగా, చట్టం పని చట్టం చేసుకుపోతుందని మరికొందరు అంటున్న ఈ తరుణంలో ఈ రోజు కోర్టులో జరిగే పరిణామాలపై అంతటా ఆసక్తి నెలకొన్నది.