Kartik Aaryan-Karan Johar: ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హీరో కార్తీక్ ఆర్యన్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. కార్తీక్ ఆర్యన్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన కరణ్ జోహార్ ‘దోస్తానా -2’ సినిమాను మధ్యలోనే ఆపేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ కారణంగా కోట్ల రూపాయాల నష్టం వాటిల్లినా… కార్తీక్ తో మూవీ చేయకూడదనే నిర్ణయానికే కరణ్ వచ్చాడని అన్నవాళ్ళూ ఉన్నారు. అయితే… ఇటీవల కార్తీక్ ఆర్యన్ వరుస విజయాలను అందుకోవడంతో కరణ్ జోహార్ దిగివచ్చాడని బాలీవుడ్ వర్గాల కథనం. టాప్ 20 ఆల్ టైమ్ బాలీవుడ్ నటుల జాబితాలోనూ కార్తీక్ ఆర్యన్ చోటు దక్కించుకోవడంతో చాలామంది నిర్మాతలు తిరిగి అతనితో సినిమాలు నిర్మించేందుకు తహతహలాడుతున్నారట.